YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

షర్ట్ లేకుండా బీచ్ డేని ఆస్వాదిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

షర్ట్ లేకుండా బీచ్ డేని ఆస్వాదిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

న్యూ డిల్లీ ఆగష్టు 1
సూటూ, బూటుతో నిత్యం ఎంతో హుందాగా కనిపించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  తాజాగా షర్ట్ లేకుండా దర్శనమిచ్చారు. బేస్ బాల్ క్యాప్ కళ్లకు సన్ గ్లాసెస్ ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తోంది.80 ఏళ్ల బైడెన్ డెలావర్ లోని రెహోబోత్ వద్ద ఉన్న బీచ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కాసేపు బీచ్ లో సరదాగా సమయాన్ని గడిపారు. తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి.. షర్ట్ లేకుండా బీచ్ లో ఎంజాయ్ చేశారు. అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ అద్యక్షుడి ఫొటోలను క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘రెహోబోత్ బీచ్ లో ప్రెసిడెంట్ అద్భుతమైన బీచ్ డే ను ఆస్వాదిస్తున్నారు’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.

Related Posts