YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల వేళ... సినిమాల గోల

ఎన్నికల వేళ... సినిమాల గోల

విజయవాడ, ఆగస్టు 3, 
వైసీపీ నేతలకు పవన్ ఫోబియో పట్టుకుందని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబుపై సినిమా, వెబ్ సిరీస్ తీస్తున్నట్లు ప్రకటించారు. బ్రో సినిమాపై మంత్రి అంబటి రాంబాబు మాటల యుద్ధం కొనసాగుతోంది. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ తనను ఉద్దేశించిందేనని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా లావాదేవీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ బయోపిక్ తీస్తానని ఆ సినిమాకు టైటిల్స్ కూడా విడుదల చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. తిరుపతిలో జనసేన నేతలు వినూత్నంగా నిరసన తెలిపాయి. అంబటి రాంబాబుపై SSS పేరుతో సినిమా తీస్తున్నామని, ముహూర్తం షాట్ తీశారు జనసేన నేతలు. అంబటి రాంబాబు బయోపిక్ కు SSS 'సందులో సంబరాల శ్యాంబాబు' అని పేరుపెట్టామని జనసేన నేతలు తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ముంబయి రెడ్ లైట్ ఏరియా నుంచి ఇద్దరిని తీసుకొస్తామన్నారు. రెడ్ లైట్ ఏరియా నుంచి ఎవరూ రాకపోతే కోల్ కతా చాందినీ గంజ్ నుంచి హీరోయిన్‌లను తీసుకొస్తాని ప్రకటించారు. జగ్గూ భాయ్ సమర్పణలో ఎస్ఎస్ఎస్ సినిమాను రూపొందిస్తామన్నారు. అంబటి రాంబాబు మరోసారి పవన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే... XXX రాంబాబు అనే సినిమా తీస్తామన్నారు.పవన్ కల్యాణ్ పేరు విన్నా, ఫొటో చూసినా వైసీపీ నేతలు, మంత్రుల్లో వణుకు స్టార్ట్ అవుతోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు. సీఎం జగన్‌కు పవన్ ఫోబియో పట్టుకుందన్నారు. వారికి కేటాయించిన శాఖలపై ఎప్పుడూ మాట్లాడని మంత్రులు...పవన్ ను విమర్శించేందుకు ముందు ఉంటున్నారని ఆరోపించారు. జనసేన వల్ల వైసీపీ ఓడిపోతుందనే భయంతో వైసీపీ దుష్ప్రచారాలు మొదలుపెట్టిందన్నారు. బ్రో సినిమాపై మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని పోతిన మహేష్ నిలదీశారు. లేదంటే మంత్రుల పదవులకు రాజీనామా చేసి సినిమా మ్యాగజైన్ నడుపుకోండని హితవు పలికారు. మంత్రులు సినిమా రివ్యూలు రాసుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేసి బ్రో సినిమాపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు దమ్ముంటే ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సవాల్ చేశారు.
బ్లాక్ మనీని వైట్ మనీ చేయడంలో సీఎం జగన్ నిపుణులని పోతిన మహేశ్ విమర్శించారు. విదేశాల్లో జైలు శిక్ష అనుభవించిన నిమ్మగడ్డ ఎవరి పార్టనర్ అందరికీ తెలుసన్నారు. సీఎం జగన్ పై వెబ్ సీరీస్ ప్లాన్ చేశానని పోతిన మహేశ్ తెలిపారు. ఈ వెబ్ సిరీస్ కు తల్లి, చెల్లి ఖైదీ నంబర్ 6093, డాక్టర్ ఆఫ్ వివేకా, గంజాయి మిస్ అయిన అమ్మాయి , మధ్యలో ఇసుక దిబ్బలు, కోడి కత్తి సమేత శ్రీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అదే ఇల్లు, ఒక ఖైదీ వదిలిన బాణం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయన్నారు. ఈ సినిమాలో వైసీపీ నటులు కూడా ట్రై చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. తెల్ల జుట్టు ఉన్నా పర్వాలేదని పోతిన మహేశ్ తెలిపారు. అన్ని విషయాలను వివరంగా వెబ్ సిరీస్ తీస్తామని పేర్కొన్నారు.
బ్రో బిజీలో అంబటి
 ఏపీ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు. ఆయన గత మూడు నాలుగు రోజులుగా బ్రో సినిమాను టార్గెట్ చేసుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో  వైసీపీ పాలనలో ప్రాజెక్టులు పడకేశాయని పర్యటనలు చేస్తున్న చంద్రబాబు అంబటి రాంబాబు తీరుపై స్పందించారు.  కడప జిల్లా, కొండాపురం మండలం తిమ్మాపురం చేరుకున్నారు. అక్కడ సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై - యుద్ధభేరి పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించారు. తాను ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ‘బ్రో’ సినిమా గురుంచి మాట్లాడతారని చంద్రబాబు సెటైర్లు వేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై - యుద్ధభేరి.. ప్రజల్లో చైతన్యం కోసం పెట్టుకున్నామని, ప్రజలకు ఎవరెవరు ఏమి చేశారు... ఎవరివల్ల నష్టం జరిగిందో తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఇవన్నీ చూశాక కలత చెందానని.. రాష్ట్రంలో అనాగరికంగా విధ్వంసం చేశారని, చరిత్ర సృష్టించిన గండికోట... విర్రవీగుతున్న నేత సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంతంలోనే మీటింగ్ పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. నీటికోసం యుద్ధాలు జరిగాయన్నారు. కడప జిల్లాకు పెద్ద అసెట్ గండికోట.. బెస్ట్ టూరిజం హాబ్ గండికోట... చాలా బ్రాహ్మాండంగా అభివృద్ధి చేశానన్నారు. అలాగే ఒంటిమిట్టను అభివృద్ధి చేశానని, ఎయిర్ పోర్టును ఆధునీకరించానని చెప్పారు.సీఎం జగన్ తన మనుషుల కాంట్రాక్టుల కోసం రూ. 5 వేల కోట్లు దోపిడీకి శ్రీకారం చుట్టారని చంద్రబాబు విమర్శించారు. అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు రాకపోతే గండికోటకు నీళ్లు రావని, కడప జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా వల్ల ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. ప్రాజెక్టుల దగ్గర నిద్ర పోయానని, అవుకు తోటపల్లి దగ్గర ఐదేళ్లు టెండర్లు పిలవద్దని చెప్పిన మిమ్మల్ని ఏమనాలన్నారు.

Related Posts