YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీ కాంగ్రెస్ లో బీసీ లొల్లి...

టీ కాంగ్రెస్ లో బీసీ లొల్లి...

హైదరాబాద్, ఆగస్టు 3, 
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఏదో ఒక లొల్లి కామన్.. ఇప్పుడు మరో సరికొత్త విషయం అగ్గిరాజేసింది. ఇది తెలంగాణ వరకే పరిమితం కాలేదు.. ఏపీ నుంచి నుంచి కూడా పొగ వస్తుండటం ఇప్పుడు.. పార్టీలో పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే.. నేరుగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను కలవడంపై కాంగ్రెస్‌లో భిన్న వాదనలు మొదలయ్యాయి. పార్టీలో ఇప్పటికే బీసీ నేతలు.. బీసీ ఏజెండాతో పని చేస్తున్న నేపథ్యంలో.. థాక్రే పార్టీ నేతలను కాదని బయటి వ్యక్తితో చర్చలు జరపడం ఏంటంటూ లోలోన రగిలిపోతున్నారని టాక్.. పార్టీలో ఉన్న నేతలతో సంప్రదింపులు చేయకుండా.. వేరే పార్టీ నేతతో భేటీ కావడంలో మతలబు ఏంటంటూ ఆవేదన చెందుతున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు థాక్రే తీరుపై ఏపీ కాంగ్రెస్ నేతలు సైతం గుర్రుగా ఉన్నారని సమాచారంతెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రశస్త్రాలను సంధిస్తోంది. పార్టీ వైపు అన్ని వర్గాలను సమీకరించడం కోసం.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా పార్టీ వైపు బీసీ వర్గం ఓట్లను మచ్చిక చేసుకోవడంపై ప్రధాన దృష్టి పెట్టింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. తెలంగాణలో కూడా 50 శాతంగా ఉన్న బీసీలను మచ్చిక చేసుకుంటే విజయం సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే బీసీ వర్గాలకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు తెలంగాణ పార్టీ నేతలు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో సైతం బీసీలకు ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీర్మానం చేశారు. అలాగే త్వరలో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.బీసీ డిక్లరేషన్ సన్నాహక సమావేశాల్లో భాగంగా పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్ని జిల్లాల్లో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. పార్టీలోనే టీం బీసీ పేరుతో.. చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామి వంటి బీసీ నేతలు సైతం సమావేశాలు చర్చలు నిర్వహిస్తూ బీసీ వర్గాలను ఏకతాటి పైకి తెస్తున్నారు. బీసీ డిక్లరేషన్లో ఏ యే అంశాలు ఉండాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే.. పార్టీ నేతలతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండానే నేరుగా వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య నివాసానికి వెళ్లి భేటీ అయ్యారన్న విషయం పార్టీలో తీవ్ర దుమారం రేపుతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న బీసీ నేతలను కాదని.. ఠాక్రే.. కృష్ణయ్య తో ఎలా భేటీ అవుతారంటూ ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. థాక్రే తీరు సొంత పార్టీ నేతలను అవమానపరిచేలా ఉందంటూ కీలక నేతలకు చెప్పుకుంటూ ఆవేదన చెందుతున్నారని సమాచారం.పార్టీలో అత్యంత సీనియర్ బీసీ నేతలు చాలా మంది ఉన్నా .. వారితో కనీసం సంప్రదించకుండానే థాక్రే నేరుగా వెళ్లి భేటీ కావడం సమంజసం కాదంటూ మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఏపీ నేతలు సైతం.. థాక్రే తీరుపై గుర్రుగా ఉన్నారు. ఏపీలో పార్టీని చావు దెబ్బ తీసిన జగన్ పార్టీకి చెందిన వ్యక్తితో.. ఎలా భేటీ అవుతారంటూ మండిపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.. ఇది చివరకు రాజకీయంగా నష్టం కలిగించేలా ఉన్నాయంటూ లోలోపల రగిలిపోతున్నట్లు సమాచారం.తెలంగాణలో రాజకీయంగా ఏదో మైలేజ్ సాధించాలని చూసిన ఇంచార్జ్ థాక్రే.. చర్యలు బెడిసి కొడుతుండటం ఇప్పుడు టీపీసీసీలో హాట్ టాపిక్ గా మారింది. బీసీ నేతతో డైరెక్టుగా భేటీ కావడం.. ఇటు తెలంగాణ.. అటు ఏపీ నేతలు ఫైర్ అవుతుండటంతో ఈ వ్యవహారం ముందుముందు ఎటువైపుకు దారి తీస్తుందనేది వేచిచూడాల్సిందే..

Related Posts