
హైదరాబాద్
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై హైకోర్టులో విచారణ మంగళవారం జరిగింది. గ్రూప్-1 రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం విచారిస్తూ ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.