YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇజ్రాయెల్‌ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌... అరబ్‌ నేతలతో బైడెన్‌ భేటీ రద్దు..

ఇజ్రాయెల్‌ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌...   అరబ్‌ నేతలతో బైడెన్‌ భేటీ రద్దు..

న్యూ డిల్లీ అక్టోబర్ 18
హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటనాలో  భాగంగానే బైడెన్‌ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో టెల్‌ అవీవ్‌లోని బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో దిగారు. అక్కడ బైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు స్వాగతం పలికారు.కాగా, హమాస్‌ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్‌ ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌తో చర్చించనున్నట్లు వెల్లడించింది.
అరబ్‌ నేతలతో బైడెన్‌ భేటీ రద్దు..
మరోవైపు, బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దైంది. ఇజ్రాయెల్‌ పర్యటన తర్వాత బైడెన్‌ జోర్డాన్‌ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్‌ నేతలతో సమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2, ఈజిప్టు ప్రధాని ఎల్‌-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్‌ముద్‌ అబ్బాస్‌ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. అయితే, నిన్న గాజా ఆసుపత్రిపై దాడి ఘటనతో అనూహ్యంగా బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దైంది. బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దైనట్లు జోర్డాన్‌ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది తెలిపారు. అయితే ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

Related Posts