YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

తొలి సారి ఇల్లు కొంటే జీఎస్టీపై 4 శాతం తగ్గింపు..

తొలి సారి ఇల్లు కొంటే జీఎస్టీపై 4 శాతం తగ్గింపు..

- 12 శాతానికి బదులు.. 8 శాతం  జీఎస్టీ కడితే చాలు

సొంతిల్లు..కొత్తిల్లు కొనాలనుకుంటున్నారా? అది తొలి ఇల్లేనా? అదే అయితే.. మీకో శుభవార్త. తొలి ఇల్లు..సొంతిల్లు కల తీర్చుకోవాలనుకుంటున్న వారికి కేంద్రం ఓ మంచి వార్తను చెప్పింది. తొలి ఇంటిని కొనుగోలు చేసే వారికి గృహ కొనుగోలుపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా గృహ కొనుగోళ్లపై కేంద్రం 12 శాతం జీఎస్టీని విధిస్తోంది. అయితే, తొలి ఇంటిని కొంటున్న వారికి మాత్రం దానిని 4 శాతం తగ్గించి 8 శాతానికి కుదించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) ద్వారా ఈ జీఎస్టీ తగ్గింపును వర్తింపజేయనుంది. తొలి ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వ్యక్తి వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉంటే.. వారికి ఈ లబ్ధి చేకూరుతుంది. ఇక, 1615 చదరపుటడుగుల వైశాల్యం వరకు ఈ మినహాయింపును వర్తింపజేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక, సీఎల్ఎస్ఎస్ పథకం వర్తించని వారు మాత్రం యథావిధిగా 12 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ నిర్ణయం నిర్మాణ రంగానికి ఊతమిస్తుందని, ధరలు నాలుగు శాతం వరకు తగ్గుతాయని భారత కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) అధ్యక్షుడు గెతంబర్ ఆనంద్ చెప్పారు. 

Related Posts