YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సగర్వంగా తలెత్తుకోవాలి... సన్‌రైజర్స్ జట్టు ఫై సచిన్ ట్వీట్..!!

సగర్వంగా తలెత్తుకోవాలి... సన్‌రైజర్స్ జట్టు ఫై సచిన్ ట్వీట్..!!

 నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హైద్రాబాద్ ఫై చెన్నై అద్భుత విజయం సాదించింది. చెన్నై బ్యాట్సమెన్ వాట్సన్ విధ్వంసకర బ్యాటింగ్  తో మూడో సారి టైటిల్ ను తమ ఖాతా లో వేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సందర్భంగా సచిన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఉద్దేశించి  ట్వీట్ చేశారు. సన్‌రైజర్స్ జట్టు ఓటమి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లు చాలా బాగా ఆడారన్నారు. సమష్టి కృష్టి ఈ మ్యాచ్‌లో కనిపించిందన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ఎలా ఆడాలో.. అలాంటి ఆటతీరును సన్‌రైజర్స్ జట్టు కనబర్చిందని సచిన్ ట్వీట్ చేశారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లు సగర్వంగా తలెత్తుకోవాలని సచిన్ ట్వీట్ చేశారు.
 

Hard luck @SunRisers. You really played well, displayed quality team work and thoroughly deserved to be in the finals. You can proudly hold your heads high. pic.twitter.com/IWG7h9tGTb

— Sachin Tendulkar (@sachin_rt) May 27, 2018

Related Posts