YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

న్యూ డిల్లీ నవంబర్ 21
అమెరికా నావికాదళానికి చెందిన ఓ భారీ విమానం రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో చోటు చేసుకుంది. సముద్రంలో బోటింగ్‌ చేస్తున్న వారు వెంటనే అప్రమత్తమై సహాయం చేయడంతో విమానంలోని సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అమెరికా నౌకాదళానికి చెందిన పీ-8ఏ పొసెడాన్‌ విమానం రన్‌వేపై అదుపుతప్పి హవాయి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో సముద్రంలో బోటింగ్‌ చేస్తున్న వారు విమానాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విజిబిలిటీ తక్కువగా ఉండటం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Related Posts