YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మొదటి వారం నుంచి ప్రజాక్షేత్రంలోకి బాబు

మొదటి వారం  నుంచి ప్రజాక్షేత్రంలోకి బాబు

కాకినాడ, నవంబర్ 29,
స్కిల్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత దాదాపు రెండున్నర నెలల పాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు స్టాండ్ స్టిల్ కు వచ్చేశాయి. ఆ పార్టీ మొత్తం చంద్రబాబు అక్రమ అరెైస్టునకు నిరసనలు, ఆందోళనలలో నిమగ్నమైపోయింది. మధ్యలో రాజమహేంద్రవరం జైలు వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ తెలుగుదేశం తో కలిసే ఎన్నికలకు వెడుతుందని ప్రకటించడం, ఆ తరువాత సమన్వయ కమిటీల ఏర్పాటు, వాటి సమావేశాలు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలు ఇలా వరుస కార్యక్రమాలు జరిగినా క్షేత్రస్థాయిలో, ప్రజా సమస్యలపై ఆ పార్టీ శ్రేణులు, నేతలు కాన్ సన్ ట్రేట్ చేయలేదనే చెప్పాలి. మొత్తం పార్టీ దృష్టంతా చంద్రబాబు న్యాయపోరాటంపైనే కేంద్రీకృతమైపోయింది. ఈ తరుణంలో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయడంతో ఇక ఇప్పుడు తెలుగుదేశం క్షేత్రస్థాయిలో యాక్టివ్ కావడంపై దృష్టిపెట్టింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీనికి తోడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా  నిజం గెలవాలి యాత్రను త్వరలోనే ప్రారంభించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి  పేరుతో నారా భువనేశ్వరి యాత్రచేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు విడుదల కావడం, ఆయన నేత్ర చికిత్స, వైద్యపరీక్షలు వంటి కారణాలతో ఆమె యాత్ర కూడా తాత్కాలికంగా ఆగింది.  అయితే ఇప్పుడు ఆమె నిజం గెలవాలి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటన ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించి అందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు.  అయితే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పర్యటనలు ఎప్పుటి నుంచి మొదలౌతాయన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని అంటున్నారు. సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తీర్పు వెలువడే వరకూ చంద్రబాబు పర్యటనలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.  వాస్తవానికి చంద్రబాబుకు మధ్యంతర బెయిలు సందర్భంగా విధించిన షరతుల గడువు  ముగిసిపోయింది. ఆ తరువాత నుంచి ఆయన ప్రచారానికి, పర్యటనలకు ఎటువంటి షరతులూ ఉండవు. అయితే సుప్రీం కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ పై తీర్పు కూడా దాదాపుగా అదే రోజున వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే గురువారం  పైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంలో విచారణ ఉంది. దాని కంటే ముందుగానే క్వాష్ పై తీర్పు వెలువరిస్తామని సుప్రీం బెంచ్ తెలిపిన సంగతి విదితమే.క్వాష్ పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన తరువాతనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా ఆయన  మధ్యంతర బెయిలు ఆంక్షలు ముగిసిన అనంతరం గురువారం తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.   సుప్రీంకోర్టులో క్వాష్ పై సానుకూల తీర్పు వచ్చిన తరువాత చంద్రబాబు కార్యాచరణ ప్రారంభమౌతుందని చెబుతున్నాయి.   అందులో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి భారీ బహిరంగ సభలలో చంద్రబాబు ప్రసంగిస్తారని చెబుతున్నారు.  వాటిలో తొలి సభను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఇప్పటికే తెలుగుదేశం సన్నాహాలు చేస్తున్నది. హిందుపురం ఎమ్మెల్యే బాలయ్య సహా తెలుగుదేశం, జనసేన ముఖ్య నేతలంతా ఈ సభలో పాల్గొని ఇరు పార్టీలూ వచ్చే ఎన్నికలలో సమష్టిగా పని చేస్తున్నాయన్న సంకేతాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నాయి.  ఈ సభా వేదిక నుండే   ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.  

Related Posts