YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుఫాన్ దాటికి ధ్వంసం అయిన పంటలు

తుఫాన్ దాటికి ధ్వంసం అయిన పంటలు

కడప
ఉమ్మడి కడప మండలం లోని పలు గ్రామాలలో  వివిధ రకాల పంటలు సాగుచేసిన రైతులు తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయారు. కోసిన వరి పంట ధాన్యం కుప్పలు పొలాల్లోనే ఉండిపోయాయి. ధాన్యం రంగు మారతాయోనన్న భయం రైతులు  ఉన్నది. మరికొన్నిచోట్ల వరి పంట పూర్తిగా నేలకొరిగి వర్షపు నీటిలో మునిగిపోవడంతో ఎక్కడ మొలకలు వస్తాయో నన్న ఆందోళన నెలకొంది. దీంతో రైతుల దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని రోజులుగా ముసురుగా ఉండటం మొన్నటి నుండి ఏకతాటిగా వర్షం పడుతుండడంతో సాగుచేసిన టమోటా మిరప రైతుల పరిస్థితి అగమగోచరంగా తయారైంది.  ఉమ్మడి జిల్లాలోని రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి తదితర ప్రాంతాల లోని ఉద్యానవన హోటల్ భారీగా దెబ్బతిన్నాయి పులివెందుల నియోజకవర్గంలో పలు మండలాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు . తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కునేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

అతలాకుతలమైన దివిసీమ..
మిచాంగ్ తుఫాన్ ప్రభావానికి దివిసీమ ప్రాంతం, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని  కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లోని రహదారులు జలమయమయ్యాయి.. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఈదురు గాలులకు వరి సాగుభూములు నేలకు ఒరిగి జలమయమయ్యాయి.. చేతికొచ్చిన పంట దక్కకపోవటంతో పంట పొలాలను చూసి రైతాంగం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ ప్రభావంతో రైతాంగం కుదేలయ్యారు.. తుపాను ప్రభావం తో పూర్తిగా నీటి ముంపునకు గురింయిన పంట పొలాలు ను అధికారులు పరిశీలించి ఎకరాకు40వేల రూపాయలు నష్టం పరిహారం చెల్లించాలి , క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి ని రైతులు కోరుతున్నారు..

బాపట్ల సమీపంలో తీరాన్నితాకిన మిగ్‌జాం తుఫాన్‌

ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న మిగ్‌జాం తుఫాన్‌ తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో ఇది తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న మిగ్‌జాం తుఫాన్‌ తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో ఇది తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ కారణంగా నెల్లూరు, బాపట్ల, ప్రకాశం సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.కోస్తాంధ్ర తీరానికి అత్యంత దగ్గరగా మిగ్‌జాం తుఫాన్‌ కదులుతోందని అంతకుముందు ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాన్‌లో కొంత భాగం సముద్రంలో.. మరికొంత భాగం భూమిపై ఉన్నట్లు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాన్‌ కేంద్రకంలోని మేఘాలు భూభాగంపై ఉన్నట్లు వెల్లడించింది.

Related Posts