YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్..

గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్..

వె‌బ్‌సైట్‌లో విసుగుపుట్టించే ఆడియో ఆన్ యాడ్‌లను మ్యూట్‌ చేయొచ్చు 

క్రోమ్ 64 కొత్త వెర్షన్ అప్‌డేట్‌తో ‘మ్యూట్ సైట్’ అనే ఫీచర్ ప్రవేశపెట్టిన గూగుల్

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను మీరూ ఉపయోగిస్తున్నారా?. ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు సంబంధిత కొన్ని వెబ్‌సైట్లల్లో అవసరం లేని యాడ్స్ పదేపదే ఓపెన్ అయి విసుగు పుట్టిస్తున్నాయా? ఆటోమేటిక్‌గా ఆడియో యాడ్స్ ఓపెన్ అవుతుండటంతో మాటమాటికి క్లోజ్ చేయాల్సి వస్తుందా?. అయితే ఈ క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిందే. ఇలాంటి సమస్యను అధిగమించేందుకు ప్రముఖ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్‌లో సరికొత్త వెర్షన్‌ ఆప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. అదే ‘మ్యూట్ సైట్’ ఫీచర్. క్రోమ్ 64 కొత్త వెర్షన్ ఆప్‌డేట్‌లో మాత్రమే ఈ ‘మ్యూట్ సైట్’ బటన్ ఉంటుంది. ఈ కొత్త ఆప్‌డేట్ పొందాలంటే ముందుగా మీ సిస్టమ్ పీసీ, ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోం బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోని ఉండాలి. మీరు వాడుతున్న క్రోం బ్రౌజర్ వెర్షన్ అప్‌డేట్ అయిందో ఇలా చెక్ చేసుకోవచ్చు.. 

క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ చేయండిలా.. New Google Chrome update, Mute Site Feature, allow you to mute sites, audio-on ads - and block

- క్రోమ్ బ్రౌజర్‌కు కుడివైపున పై కార్నర్‌లో సిస్టమ్ స్క్రీన్‌‌లో క్లోజ్ బటన్ కింద (కస్టమైజ్ అండ్ కంట్రోల్ గూగుల్ క్రోమ్) ఓ బటన్ ఉంటుంది.

- దానిపై మౌస్ పెట్టగానే కర్సర్ చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే డ్రాప్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్‌లో అడుగునా ‘హెల్ప్’ బటన్‌ కనిపిస్తుంది.

అందులో ‘అబౌట్ గూగుల్ క్రోమ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీకు చెకింగ్ ఫర్ అప్‌డేట్స్‌ అంటూ క్రోమ్ 64 వెర్షన్ కొత్త అప్‌డేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీ క్రోమ్ బ్రౌజర్ కొత్త వెర్షన్ అప్‌డేట్ రెడీ. 

మ్యూట్ సైట్’ ఫీచర్
క్రోమ్ 64 వెర్షన్‌లో పొందే ఈ ‘మ్యూట్ సైట్’ ఫీచర్‌‌తో అవసరం లేని ఆడియో యాడ్స్, ఆటోమేటిక్ ఓపెన్ యాడ్స్‌ను మ్యూట్ చేయెచ్చు. ఉదాహరణకు మీరూ వాడే క్రోమ్ బ్రౌజర్‌లో ఐదు ట్యాబ్‌లు ఓపెన్ చేసారునుకుందాం. ఆ ట్యాబ్స్‌లో ఓపెన్ చేసిన వెబ్‌సైట్‌కు సంబంధించిన యాడ్స్ పదేపదే ఓపెన్ అయినట్టయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే.. ఆ ట్యాబ్‌పై మౌస్‌తో రైట్ క్లిక్ చేయగానే డ్రాప్ లిస్ట్ వస్తుంది. అందులో ‘మ్యూట్ సైట్’ అనే అప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు. ఆ ఒక్క ట్యాబ్‌లోని యాడ్స్, ఆడియో మాత్రమే మ్యూట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోండి..

Related Posts