YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

మంథని
సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాట్ సర్వ మానవాళికి దిక్సూచి చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతిని భారతీయ జనతా పార్టీ బిజెపి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మంథని పట్టణ ఇన్చార్జ్ సబ్బని సంతోష్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బిజెపి పార్టీ శ్రేణులు మంథని పట్టణంలోని చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సనాతన ధర్మం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తిని అని ఆనాడు హిందువులపై అనేక అరాచకాలకు చెల్లించిపోయి అష్టదళ భారత సైన్యం వ్యవస్థాపించి  ముస్లిం సామ్రాజ్యములపై దాడి చేసి రాజ్యాలని కైవసం చేసుకుని హిందూ సనాతన కోటలు నిర్మించి ధర్మ పరిరక్షణ కోసం ధర్మ యుద్ధం కొనసాగించారని అన్నారు. ఆ కాలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భవాని మాత అనుగ్రహం కోసం యోగ దీక్ష బూనితే సాక్షాత్తు ఆ భవాని మాత ప్రత్యక్షమై నేను నీకు ఈ ఖడ్గం బహూకరిస్తున్నానని ఈ ఖడ్గంతో సనాతన ధర్మం విచ్చిన్నం కొరకు ఎవరైతే అరాచకాలు సృష్టిస్తారో వారిని ఈ ఖడ్గంతో శిక్షించాలని భవాని మాత  వరం ఇవ్వడం జరిగిందని ఆ ఖడ్గం తోని అనేక హిందూ వ్యతిరేక శక్తులపై గేరిల్లా పోరాటం నిర్వహించి శత్రుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా చత్రపతి శివాజీ యుద్ధం ప్రకటించి హిందు ధర్మాన్ని సంరక్షించే యోధుడిగా చిరస్థాయిలో నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను నేటి యువత హిందూ ధర్మ పరిరక్షణ కోసం జనహిత కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంథని మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్, ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యులు బోగోజు శ్రీనివాస్, చిలువేరి సతీష్, బోయిని నారాయణ, రేపాక శంకర్, నారమల్ల కృష్ణ, ఎడ్ల సాగర్, గుంటుపల్లి గురువేష్, పార్వతి విష్ణు, అయ్యింటి మల్లేష్, ఎండి చాంద్ పాషా, బీజేవైఎం నాయకులు తోటపల్లి లక్ష్మణ్, కాశి పేట రాకేష్, కాపురం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts