YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇదేం చిల్లర పనులు అంకుల్

ఇదేం చిల్లర పనులు అంకుల్

జగిత్యాల
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై వెలసిన పోస్టర్లు జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అయనకు టికెట్ ఇవ్వొద్దంటూ బీజేపీ అసమ్మతి నేతలు.  మెట్పల్లి, కోరుట్లలో కరపత్రాలు పంపిణీ చేసిన  విషయం తెలిసిందే. మెట్పల్లి, కోరుట్లలో న్యూస్ పేపర్ లలో కరపత్రాలను న్యూస్ పేపర్ లో పెట్టి పంచారు. నలుగురు వ్యక్తుల పేర్లతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  కి టికెట్ ఇవ్వొద్దంటూ పేర్కొంటూనే హాట్ కామెంట్స్ చేసారు. "కండ్లకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తియ్యడు ప్రజలను చూడడు... కారు నుంచి దిగడు ప్రజలతో మాట్లాడడు, ఇంత అహంకారి... నియంత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ గా వద్దు" అని ఆ కరపత్రాల్లో పొందుపరిచి పంచిన కర పత్రాలు జగిత్యాల లో కలకలం రేపుతోంది...మరోవైపు,మ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ సెటైర్లు వేశారు.    తనకు వ్యతిరేకంగా వచ్చిన కరపత్రాలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేపించారని ఆరోపించారు.
ఇవేం పనులు అంకుల్ అంటూ కామెంట్ చేశారు. తన తండ్రి స్నేహితుడైన జీవన్ రెడ్డి తనకు తండ్రి సమానులని  ఆయన కలిసిన ప్రతిసారి ఆశీర్వాదం తీసుకునేవాడినని చెప్పారు. దానిలో మీకు అహంకారం ఎక్కడ కనబడిందని ప్రశ్నించారు. కండ్లకు కూలింగ్ ఉంటదని కళ్ళద్దాలు పెట్టుకుంటానని తెలిపారు. బీజేపీకి ఎప్పుడు 3వేల నుంచి 4వేల ఓట్లు వచ్చేవని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ కు దీటుగా ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏ రేంజ్ లో వస్తాయో తెలుసుకోండని సూచించారు. 2014 నుండి ఇదే చివరి ఎలక్షన్ అనుకుంటూ ఇప్పటివరకు పోటీ చేస్తూనే ఉన్నారని విమర్శించారు. జీవన్ రెడ్డి అంకుల్ మీ ఇంటి సభ్యులు చేస్తున్న చిల్లర రాజకీయాలను ఆపించాలని అర్వింద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి సూచించారు.

Related Posts