YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ లో దెయ్యం..భయ్యం

కరీంనగర్ లో దెయ్యం..భయ్యం

కరీంనగర్, ఫిబ్రవరి 20
ఆ ఊరికి దెయ్యం పట్టిందా? వరుస మరణాలకు కారణం అ సైతానేనా..? చచ్చిన తర్వాత కూడా పీక్కుతింటోందా? ఇలా భయంభయంగా బతికేస్తోంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రజానీకం. ఊరు ఖాళీ అయ్యేదాకా వదిలేది లేదంటూ ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అక్కడే మకాం పెట్టేశారు. ఎవరు వాళ్లు.. వాళ్లకేం కావాలి.. వాళ్ల వికృత చేష్టల వెనుక అసలు విషయమేంటి..? ఎవరు తేల్చాలి ఈ మిస్టరీని? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్…అసలే వరుస మరణాలతో భయంభయం. నెల రోజుల్లో పదిమంది మృత్యువాత. వైద్యులు తేల్చిన కారణం గుండెపోటు. కానీ.. మరేదో మర్మం ఉందని స్థానికుల సందేహం. దానికితోడు స్మశానంలో దొంగలు పడ్డారు! మరుభూమిలో సంచరిస్తూ ఎముకలు కూడా మాయం చేస్తున్నారు మాయదారి మహిళలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఇదొక భయానక పరిస్థితి.  దహన సంస్కారం ముగించి అస్థికల్ని గంగలో కలిపేందుకు 11 రోజుల వరకు ఆగాలి. కానీ.. ఆలోగానే అస్థికలు మాయమైపోతున్నాయి. ఇదెక్కడి చోద్యం.. అసలిదెలా సాధ్యం.. ? అన్నదే ఇప్పుడు మిస్టరీ. సరిగ్గా ఇదే సమయంలో… స్మశాన వాటికలో కాలుతున్న కాష్టాన్ని నీళ్లతో ఆర్పి, ఎముకల్ని, బూడిదను కుప్ప చేస్తున్న మహిళల్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు. పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.  అంతిమ సంస్కారంలో భాగంగా మృతదేహం నోట్లో బంగారం పెడతారు. ఆ బంగారాన్ని చోరీ చేయడం కోసం వచ్చిన దొంగలా.. లేక.. ఇక్కడి ఎముకల్ని తీసుకెళ్లి క్షుద్ర పూజలో వాడుకుంటున్నారా.. ఇలా అంతుబట్టని ప్రశ్నలతో కొట్టుమిట్టాడుతోంది సుల్తానాబాద్ జనం.
మంచిర్యాల నుంచి ఆటోలో వచ్చిన ఈ మహిళల అసలు ఉద్దేశమేంటి.. ఈ ఊరి మీదే వాళ్లెందుకు దృష్టి పెట్టారు.. వరుస మరణాలకు - వీళ్లకు సంబంధం ఏమైనా ఉందా.. విచారించి, చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు స్థానికులు

Related Posts