YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ఏక్ నాధ్ షిండే...?

తెలంగాణలో ఏక్ నాధ్ షిండే...?

హైదరాబాద్, ఫిబ్రవరి 20
తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా.. త్వరలో ప్రభుత్వం పడిపోతుందా.. కొత్తగా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. త్వరలో మనమే వస్తాం అని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పిన మాటలు నిజమవుతాయా.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ బీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేసిన ప్రకటనల్లో ఎంత నిజముంది.. అంటే అన్నింటికీ అవునే సమాధానం వస్తోంది విశ్లేషకుల నుంచి ఇప్పుడు ఎంఐఎం మినహా.. మిగతా మూడు ప్రధాన పార్టీల్లో కోవర్టు ఆపరేషన్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు తెలంగాణలో అన్నీ కుదిరితే త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ బిగ్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ నుంచి 56 మంది, బీఆర్ఎస్‌ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. బీజేపీ గీస్తున్న స్కెచ్‌ అమలు చేస్తే.. అత్యధిక మెజారిటీతో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాడుతుంది. కాంగ్రెస్‌కు చెందిన 56 మంది, బీఆర్ఎస్‌కు చెందిన 12 మంది, బీజేపీకి చెందిన 8 మంది కలిపి మొత్తం 80 మంది ఎమ్మెల్యే బలంలో బీజేపీ సర్కార్‌ ఏర్పాటవుతుంది. ఈమేరకు లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కొత్త రాజకీయ క్రీడ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్‌ విషయానికి వస్తే 56 మంది బయటకు వస్తారని లెక్కలు వేస్తున్నారు. ఇంతమంది బయటకు రావడం జరుగుతుందా.. కుదిరే పనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతమంది బయటకు వస్తే.. కాంగ్రెస్‌ను చీల్చే నాయకుడు ఉండాలి. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే శివసేనను చీల్చిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చాలంటే అందులో మరో ఏక్‌నాథ్‌ షిండేలాంటి నేత కావాలి. అలా అయితేనే 56 మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకురాగలుగుతారు.
ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండే ఎవరు అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అంతా ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఇది తుఫాను ముందటి ప్రశాంతతా అన్న చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్‌ అంటేనే కయ్యాలు.. అసంతృప్తులు. దీనినే బీజేపీ తనకు బలంగా మార్చుకుంటుందని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు

Related Posts