YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజోలులో టీడీపీ, వర్సెస్ జనసేన

రాజోలులో టీడీపీ, వర్సెస్ జనసేన

రాజమండ్రి, ఫిబ్రవరి 23
పొత్తుల్లో భాగంగా రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించారని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. దీంతో అక్కడ జనసేన అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మొత్తంగా రేసులో నలుగురు ఉన్నారు. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేనే. ఆయన పార్టీలోనే ఉండి ఉంటే ఆయనకే టిక్కెట్ ఖరారు చేసేవారు. కానీ వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో జనసేన కొత్త అభ్యర్థిని పోటీకి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాజోలు నియోజకవర్గం గత ఎన్నికల్లో  జనసేన పార్టీ గెలిచిన ఏకైన స్థానం. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలిచి అధికార వైసీపీ  గూటికి  వెళ్లిపోయిన ఎంఎల్‌ఎను తిరిగి అదే జనసేన పార్టీ అభ్యర్థి ఓడించేందుకు రాజోలు నియోజకవర్గంలో జనసైనికులు కంకణం కట్టుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనతో రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీలో పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.  రాజోలు నియోజక వర్గంలో 2019 జనసేన గెలిచిన స్థానం. ఎస్‌సి, ఒసి (కాపు) సామాజిక వర్గాని చెందిన ఎక్కువ ఒటర్లు రాజోలులో ఉన్నారు.టీడీపీకి మంచి బలం ఉన్న నియోజకవర్గం అయిన రాజోలులో  మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీని చూసుకుంటున్నారు. జనసేన 2019లో జనసేన గెలిచిన స్థానం కావడంతో టీడీపీ  ఆశలు వదులుకుంది. గొల్లపల్లి సూర్యారావు తన కుమార్తెను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇస్తే గెలుపు ఖాయమని కూటమి నేతలకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.  అమూల్య భర్త బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం నుండి మెజారిటీ ఓట్లు తెచ్చుకుంటుదన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే గొల్లపల్లి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే.. నియోజకవర్గం టీడీపీకి ఇచ్చినట్లేనని జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గ నుంచి మరో ముగ్గురు జనసేన నేతలు పోటీ పడుతున్నారు.  రాజోలు నియోజకవర్గంలో చింతలమోరి గ్రామ సర్పంచ్‌ రాపాక రమేష్‌ బాబు తనకే సీటు వస్తుందని అంటున్నారు. రమేష్‌ బాబు వైద్య వృత్తిలో ఉండి స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  రాజోలుకే చెందిన రిటైర్డ్‌ ఐఎఎస్‌ దేవ వరప్రసాద్‌ చంద్రబాబు ప్రభుత్వంలో పని చేశారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరొకరు బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అనంతరం జనసేన పార్టీలో చేరారు. తనకే కచ్చితంగా సీటు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  . సీటు అవకాశం దక్కితే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది.  

Related Posts