YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం

బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం

హైదరాబాద్
బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆరైర్పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో లాస్య నందిత కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై 17,169 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

లాస్య నందిత మృతిపట్ల పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి
కంటోన్మెంట్ ఎం ఎం ఏ లాస్య నందిత శుక్రవారం రోడ్డు ప్రమాదం లో మరణించడం పట్ల సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మృతి తీవ్ర బాధాకరమని పేర్కొన్నారు. చిన్న వయసులోనే నందిత ను కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎం ఎల్ ఏ దివంగత సాయన్న  కుమార్తె గా లాస్య నందిత ప్రజల్లో  ముద్ర వేసుకున్నారని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

Related Posts