YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

నాలుగేళ్లకోసారి వచ్చే పత్రిక తెలుసా..?

నాలుగేళ్లకోసారి వచ్చే పత్రిక తెలుసా..?
ప్రపంచంలోనే నాలుగేళ్లకోసారి వచ్చే న్యూస్‌పేపర్‌ గురించి తెలుసా..? అలాంటి ఓ వార్తపత్రికను ఫ్రాన్స్ వాసులు బుధవారం అందుకున్నారు. ఇంతకీ ఏంటా పేపర్? దాని కథేంటీ?
ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా వార్తాపత్రికలు (News Paper) ప్రతి రోజు వస్తుంటాయి. లేదా కొన్ని ప్రత్యేక వీక్లీ, మంత్లీ, ఇయర్లీ మ్యాగజైన్‌లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కానీ, ఫ్రాన్స్‌ (France)లో ఓ న్యూస్‌పేపర్‌ మాత్రం నాలుగేళ్ల కోసారి మాత్రమే వస్తుంది. ప్రతి లీప్‌ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తుంటారు. ఈ రోజు ఫిబ్రవరి 29 కావడంతో ఫ్రాన్స్‌ వాసులు ఆ పత్రికను అందుకున్నారు.*
లా బౌగీ డు సప్పర్‌ (ది సప్పర్స్‌ క్యాండిల్‌)’ అనేది వ్యంగ్యాస్త్రాలు విసిరే వార్తాపత్రిక. రోజువారీ జీవితంలో జరిగే విచిత్రాలపై సెటైర్లను ఇందులో ప్రచురిస్తుంటారు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అని చెప్పే నిర్వాహకులు మొదటిసారిగా దీన్ని 1980లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరి 29న విడుదల చేస్తున్నారు. చివరిసారిగా 2020లో రాగా.. మళ్లీ నేడు 12వ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
20 పేజీలుండే ఈ పత్రిక (La Bougie du Sapeur)లో జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, క్రీడలు, సినిమాల వంటి వాటిపై సెటైరికల్‌ కథనాలు, ఫన్నీ జోక్స్‌తో పాటు క్రాస్‌వర్డ్స్‌ను కూడా ఇస్తారు. అయితే వాటి సమాధానాలు మాత్రం తదుపరి ఎడిషన్‌లో చెబుతారు. అంటే జవాబుల కోసం నాలుగేళ్లు ఆగాల్సిందే..! ప్రతిసారీ 2 లక్షల కాపీలను ముద్రిస్తారు. ఒక్కో పత్రిక ధర 4.9 యూరోలు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.440.
ఫ్రాన్స్‌కు చెందిన తొలితరం కార్టూనిస్ట్‌ లీ సప్పర్‌ కామెంబెర్ట్‌ గుర్తుగా ఈ పత్రికకు పేరు పెట్టారు. ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. న్యూస్‌ ఏజెంట్లు, దుకాణాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Related Posts