YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రికార్డు స్థాయిలో విదేశీమారక నిల్వలు

రికార్డు స్థాయిలో విదేశీమారక నిల్వలు

ముంబై, ఏప్రిల్ 5
కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో జరిగిన మొదటి ద్రవ్య విధాన కమిటీ  సమావేశం ఫలితాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రకటించింది. ఈ ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 03 బుధవారం నాడు ప్రారంభమైంది, ఈ రోజు ఉదయం వరకు 3 రోజుల పాటు కొనసాగింది. ద్వైమాసిక (2 నెలలకు ఒకసారి) ద్రవ్య పరపతి విధాన సమీక్షలో, రెపో రేటులో ఆర్‌బీఐ ఎంపీసీ ఎలాంటి మార్పులు చేయలేదు. అందుకే రెపో రేటును గతంలో లాగే 6.50 శాతం వద్దే కొనసాగించామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్  తెలిపారు.
రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద, బ్యాంక్ రేటు కూడా 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ 5:1 మెజారిటీతో పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకుంది.
1. భారతదేశ విదేశీ మారక నిల్వలు ‍‌ రికార్డు స్థాయిలో 645.6 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి, 29 మార్చి 2024న ఈ రికార్డ్‌ సాధ్యమైంది. కొంతకాలం క్రితం, మన దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వల గురించి ఆందోళనలు ఉన్నాయి. అయితే ఆర్‌బీఐ ఈ సమస్యపై నిశితంగా దృష్టి పెట్టి పరిష్కరించింది. కేంద్ర బ్యాంక్‌పై ఉన్న విశ్వాసాన్ని కొనసాగించింది.
2. ప్రధాన ద్రవ్యోల్బణం  రేటులో తగ్గుతోంది. కానీ, RBI లక్ష్యమైన 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. దీనిని నియంత్రిత లక్ష్యానికి తీసుకురావడం మా ప్రాధాన్యతల్లో ఒకటి.
3. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా, CPI ఇన్‌ఫ్లేషన్‌ను (వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం) నిర్దేశించిన పరిధిలోకి తీసుకురావడం అవసరం.
4. కీలక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి RBI సిద్ధంగా ఉంది. ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతానికి ద్రవ్యోల్బణాన్ని తీసుకురావడంలో MPC నిబద్ధతగా పని చేస్తుంది.
5. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, సముద్ర వాణిజ్య మార్గాల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచ స్థాయిలో ఆందోళన ఉంది.
6. ఆర్థిక వ్యవస్థలో ఉదారవాద వైఖరిని ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి RBI MPC కట్టుబడి ఉంది.
7. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని 1, 3, 4 త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి రేటు ( 7 శాతం లేదా అంతకంటే ఎక్కువగా నమోదయ్యేలా లక్ష్యం నిర్దేశించారు. రెండో త్రైమాసికానికి మాత్రమే 6.9 శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు.
8. భారత ఆర్థిక వ్యవస్థలోని బలానికి అనుగుణంగా భారతీయ రూపాయి స్థిరంగా ఉంది, పటిష్టమైన పునాదిపై ఉన్నట్లు కనిపిస్తోంది.
9. దేశంలో ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల మొత్తం వేగంగా పెరుగుతోంది.
10. ఆహార ద్రవ్యోల్బణం  రేటులో నిరంతర హెచ్చుతగ్గులు ఉన్నాయి. అయితే, 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది RBI నిర్దేశించిన 4 శాతం లక్ష్యం లోపులోకి వచ్చి 3.8 శాతం వద్ద కొనసాగుతుందని అంచనా.

Related Posts