YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

నిపా వైరస్ కు ఇద్దరు బలి

నిపా వైరస్ కు ఇద్దరు బలి
మనిషి మెదడుని తీవ్రంగా దెబ్బతిసే ప్రాణాంతక ‘నిపా’ వైరస్ మరో ఇద్దరిని బలితీసుకుంది. నిఫా వైరస్ లక్షణాలతో కేరళలోని కోజికోడ్‌లో బుధవారం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో కేరళలో నిపా మృతుల సంఖ్య 15కి చేరింది. ఈ మేరకు వైద్య అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిపా లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన జిల్లా కోర్టు సీనియర్ క్లర్క్ పి. మధుసూదన్  చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిపా వైరస్ లక్షణాలతో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరిన నిఖిల్  కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతిచెందిన ఇద్దరికి నిపా వైరస్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు.మెదడుపై తీవ్ర ప్రభావం చూపే నిపా వైరస్‌ బారిన పడిన బాధితుడు అఖిల్‌ రక్త నమూనాలను పరీక్షించగా అతడికి నిపా (పాజిటివ్) సోకినట్టు నిర్ధారించినట్టు సీనియర్ వైద్యాధికారులు పేర్కొన్నారు. నిపా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 1,353 మంది బాధితుల్లో ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు వైద్యరాలు సరిత పేర్కొన్నారు. అనుమానిత నిపా లక్షణాలతో ఆస్పత్రిలో తొమ్మిది మంది చేరగా, వారిలో ఇద్దరూ చేరారు. కోల్‌కతాలో ఆస్పత్రిలో మృతిచెందిన జవాను.. నిపా లక్షణాలతోనే మృతిచెందినట్టు తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. 

Related Posts