YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విచారణకు సహకరించని కవిత

విచారణకు సహకరించని కవిత

న్యూఢిల్లీ
కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరు పరిచారు. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. ఈనెల 6న తీహార్ జైల్లోనే కవితను ప్రశ్నించింది సీబీఐ. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు విచారణ జరగకముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత కీలక పాత్రధారి, సూత్రధారి. విజయ్ నాయర్, తదితరులతో కలిసి స్కెచ్ వేశారని సిబిఐ  ఆరోపించింది.  ఈ మేరకు ఢిల్లీ, హైదరాబాద్ లలో సమావేశాలు జరిగాయి. ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత భాగస్వామి అనేది ఇతర నిందితుల వాట్సప్ చాట్స్ లో స్పష్టమైనది. రూ. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు (₹15 కోట్లు ఒకసారి, ₹10 కోట్లు ఒకసారి )అందజేసారు. ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు. వాట్సాప్ చాట్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయి. కోర్టుకు వాటిని అందజేసాము. ఢిల్లీ లిక్కర్ విధాన రూపకల్పనలో కీలక కుట్రదారు కవిత. రకరకాల కారణాలతో విచారణకు కవిత సహకరించలేదు. ప్రశ్నించిన అంశాలకు కూడా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. మేము సేకరించిన డాక్యుమెంట్లకి కవిత చెప్పిన సమాధానాలకి పొంతన లేదు. నోటీసు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని సిబిఐ పేర్కోంది.

Related Posts