YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డీజీ లాకర్ లో ఇంటర్ రిజల్ట్స్

డీజీ లాకర్ లో ఇంటర్ రిజల్ట్స్

విజయవాడ, ఏప్రిల్ 12
ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తొలిసారిగా ఈసారి డిజీ లాకర్ లోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి డిజీ లాకర్ ద్వారా కూడా విద్యార్థులు వారి వారి ఫలితాలను చూసుకోవచ్చని చెప్పారు. డిజీ లాకర్ లోని మార్కుల జాబితా కూడా హార్డ్ కాపీతో సమానంగా ఉంటాయని అన్నారు. విద్యార్థులు వారి ఆధార్ కార్డు ఆధారంగా డిజీ లాకర్ తో లింక్ చేసుకుని మార్కుల జాబితాను తీసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే, ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు అన్నీ వెబ్ సైట్స్ లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. లక్షల మంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వర్లు అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రస్తుతం చాలా మంది తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు అంటే పాన్, ఆధార్, ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లైెసెన్స్ వంటివి తమ తమ వాలెట్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఒక వేళ పొరపాటున వాటిని పోగొట్టుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ని డాక్యుమెంట్లను వాలెట్ లో క్యారీ చేయడం కూడా ఇబ్బందే. అయితే, వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం నూతన సాంకేతికతతో డిజి లాకర్ ను అందుబాటులోకి తెచ్చింది. మన మొబైల్ లో డిజి లాకర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆధార్ కార్డు సాయంతో లాగిన్ అయ్యి మన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను అందులో అప్ లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు.మీ ఆధార్, పాన్ కార్డు, టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్స్, కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, పెన్షన్ సర్టిఫికెట్, వెహికల్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్నీ పత్రాలను డిజిలాకర్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు. మీరు వాటిని ఎప్పుడు అవసరం అయితే అక్కడ మొబైల్ లోనే అందరికీ చూపించవచ్చు. ఈ పత్రాలు అధికారికంగా చెల్లుబాటు అవుతాయి. ఇది ప్రభుత్వ యాప్ కాబట్టి పూర్తిగా సురక్షితం. ఇందులో ఎలాంటి పత్రాలనైనా సేవ్ చేసుకోవచ్చు. మీ పత్రాలను మీరు తప్ప ఎవరూ యాక్సెస్ చేసే అవకాశం ఉండదు.
ఇంటర్ రిజల్ట్స్ ఇలా చూడొచ్చు
☛ మొదట డిజిలాకర్ యాప్ ఓపెన్ చేయాలి. అక్కడ హోం పేజీలో 'ఎడ్యుకేషన్' సెక్షన్ కు వెళ్లాలి
☛ అందులో ''Board of Intermediate Education, Andhra Pradesh' లేదా BIEAP ఆప్షన్లను సెలక్ట్ చేయాలి. అక్కడ మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి.
☛ అనంతరం ‘సబ్మిట్’పై క్లిక్ చేస్తే మీ మార్కుల జాబితా ప్రత్యక్షం అవుతుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
అటు, ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ అధికారులు తెలిపారు. ఫలితాల్లో బాలికలే అమ్మాయిలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరం బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో 84  శాతంతో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకూ నిర్వహించనున్నట్లు చెప్పారు.

Related Posts