YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గేమర్స్ తో మోడీ భూటీ

గేమర్స్ తో మోడీ భూటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13
దేశంలో మోదీ చేపట్టిన విన్నూత్న కార్యక్రమాల జాబితాలో మరో రంగం కీలక స్థానం సంపాధించుకుంది. గేమర్స్‎తో సమావేశం నిర్వహించడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మోదీకి అన్నింటిపట్ల ఉన్న అభిరుచి, దార్శనికతకు ఇది తార్కాణంగా భావిస్తున్నారు టెక్కీలు. అయితే పబ్ జీ లాంటి యాక్షన్ ప్లానింగ్ గేమ్స్ పై కేంద్రం కొన్ని ఆంక్షలు విధించినటప్పటికీ వాటిని నిషేధించే దిశగా చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం దేశ యువత దీనిపై చూపిస్తున్న మక్కువను మోదీ పసిగట్టారనే చెప్పాలి. యువతరం నాడిని పట్టుకోవడంలో సిద్దహస్తులు మోదీ. అయితే అలాంటి మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలోని ప్రముఖ గేమర్లతో చిట్ చాట్ నిర్వహించి వారితో మమేకం అయ్యారు. గేమింగ్ వర్సెస్ గ్యామ్లింగ్ అనే అంశంపై చర్చ నడిచింది. ఇందులో ఏడు మంది గేమర్స్ పాల్గొన్నారు.
ఈ సమావేశం తరువాత ప్రధాని మోదీ గేమింగ్ పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారనే ఊహాగానాలకు తెరపడింది. మహిళా గేమర్ పబ్ జీ పై ఇచ్చిన వివరణ మోదీని బాగా అకట్టుకుంది. ఈ గేమ్ తో పాటు పలు ఆన్లైన్ గేమ్స్ విషయంలో రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడంలో ఆమె కీలక అంశాలను పేర్కొంది. భారతదేశంలో ప్రస్తుతం గేమింగ్ పరిశ్రమ విస్తృతంగా విస్తరిస్తోంది. దీన విలువ రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ఇది రాబోయే రోజుల్లో రూ. 33,000 కోట్ల స్థాయిని దాటవచ్చని అంచానా వేసింది. దీని కోసం తాము కృషి చేస్తున్నట్లు వివరించింది. ప్రధాని మోదీని కలిసిన ప్రముఖ గేమర్‌లలో అనిమేష్ అగర్వాల్ (8బిట్‌థగ్), మిథిలేష్ పాటంకర్ (మిత్‌పాట్), పాయల్ ధరే (పాయల్ గేమింగ్), నమన్ మాథుర్ (సోల్‌మోర్టల్), గణేష్ గంగాధర్ (స్క్‌రోస్సీ), తీర్థ మెహతాతో పాటు అన్షు బిష్త్ ఉన్నారు. వీటన్నింటితో పాటు, ప్రధాని మోడీ అనేక రకాల ఆటలను స్వయంగా ఆడి మంచి అనుభూతిని పొందారు. ఈ గేమింగ్ రూపకల్పనలో గేమింగ్ క్రియేటర్స్, గేమర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా అడిగారు.
గేమింగ్ రంగాన్ని మరింత అభివృద్ది..
మోదీతో మాట్లాడుతున్న సమయంలో, గేమింగ్ పరిశ్రమకు నియంత్రణ తీసుకురావాలని ఒక గేమర్ తన అభిప్రాయాన్ని చెబుతూ ప్రధాని మోదీని కోరారు. తద్వారా నైపుణ్యం ఆధారిత గేమింగ్‌కు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అయితే, దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ, గేమింగ్ పరిశ్రమలో నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అది బహిరంగంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అయితే, గేమింగ్, గ్యాంబ్లింగ్‌ను విభిన్న కోణాల్లో చూడటం గురించి కూడా చర్చ జరిగింది. ఇందులో రెండు రకాల వర్గాలు ఉంటారని పేర్కొన్నారు మరో గేమర్. ఈ అంశంపై మోదీ సంచలన విషయాలు చెప్పారు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం, నిబంధనలకు కట్టుబడి ఉండడం ప్రభుత్వ స్వభావమని అన్నారు. కానీ గేమింగ్ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందుతోంది. ఇది దాని సొంత సృజనాత్మకమైన అంశాలను కలిగి ఉంది కాబట్టి తమ ప్రభుత్వం గేమింగ్ పరిశ్రమను నియంత్రించాలని భావించడం లేదని చెప్పారు మోదీ. బదులుగా, ఈ రంగాన్ని మరింత అభివృద్ది చేయాలని సూచించారు

Related Posts