YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

22న భారత్ కు మస్క్..

 22న భారత్ కు మస్క్..

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16,
భారత్‌లో టెస్లా కార్ల తయారీ ప్లాంటు పెట్టాలన్న ఆ కంపెనీ చైర్మన్‌ ఎలాన్‌ మస్క్‌ కల త్వరలోనే నెరవేరబోతోంది. అనేక ప్రయత్నాల తర్వాత టెస్లాను భారత్‌లోకి అనుమతి లభించింది. ఈమేరకు తుది దశ చర్చలు జరిపేందుకు ఆ సంస్థ చైర్మన్‌ మస్క్‌ ఈనెల 22న భారత్‌కు రాబోతున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై చర్చించే అవకాశం ఉంది. ఈ సందరభంగా అధికారికంగా తమ కంపెనీ పెట్టుబడుల ప్రణాళిక ప్రకటించే ఛాన్స్‌ ఉంది. మస్క్‌ పర్యటనను కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే ధ్రువీకరించారు.దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు భారత్‌ ఇటీవల కొత్త పాలసీని ప్రకటించింది. పాత పాలసీలో సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో మస్క్‌ భారత్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ప్రకారం భారత్‌లో కనీసం 500 మిలియన్‌ డాలర్లతో టెస్లా కార్ల తయారీ ప్లాంటు నెలకొల్పే కంపెనీలకు తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకుంటే 70 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్‌ సుంకాలు విధిస్తోంది. ఇదే భారత్‌లోకి టెస్లా ఎంట్రీకి అవరోధంగా మారింది.భారత్‌ కస్టమ్స్‌ సుంకాలు తగ్గించాలని విదేశీ కంపెనీలు చాలాకాలంగా భారత్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. ఇందులో టెస్లా కూడా ఉంది. ఈ క్రమంలోనే భారత్‌ దేశీయంగా తయారీతో ముడిపెట్టి పాలసీని సవరించింది. దీంతో భారత్‌లో పెట్టుబడి పెట్టే కంపెనీలకే సుంకంలో తగ్గింపు వర్తించనుంది. తాజాగా సవరించిన పాలసీతోనే మస్క్‌ భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా ప్రధాని మోదీతో మస్క్‌ గతేడాది అమెరికాలో చర్చలు జరిపారు. భారత మార్కెట్‌లోకి టెస్లా ఎంట్రీకి సంబంధించి 2024లో తాను వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో భారత్‌ పాలసీలో సవరణ చేయడంతో మస్క్‌ టూర్‌ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
2 లక్షల యూజర్లకు షాక్ప్రపంచంలో అతిపెద్ద సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒకటైన ఎక్స్‌ కార్ప్‌(ట్విట్టర్‌) 2 లక్షలకు పైగా భారతీయులకు షాక్‌ ఇచ్చింది. ప్లాట్‌ ఫాం అధినేత, టెస్లా సీఈవో అయిన ఎలాన్‌ మస్క్‌ భారత్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలతను, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్‌ కట్టడికి ఎక్స్‌ చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన 2,12,627 ఎక్స్‌ ఖాతాలను నెల వ్యవధిలో నిషేధించింది.ఫిబ్రవరి 26 నుంచి ఎక్స్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలపై దృష్టిపెట్టింది. మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1,235 ఎక్స్‌ ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. 2021 కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఎక్స్‌ కార్ప్‌ తన నెలవారీ నివేదికలో ఈమేరకు తెలిపింది. మొత్తంగా ఈ రిపోర్టింగ్‌ ద్వారా దేశవ్యాప్తంగా 2,13,862 ఖాతాలపై నిషేధం విధించినట్లు ఎక్స్‌ స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ ఎక్స్‌ వినియోగదారుల నుంచి 5,158 ఫిర్యాదులు అందినట్లు ఎక్స్‌ కార్ప్‌ తెలిపింది. తమ గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ మెకానిజం ద్వారా వీటిని కంపెనీ పరిష్కరించింది. అంతేకాకుండా, ఖాతా సస్పెన్షన్‌లకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన 86 ఫిర్యాదులను కంపెనీ ప్రాసెస్‌ చేసింది.

Related Posts