YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వివాదంలో మాధవీలత వీడియో క్షమాపణ

వివాదంలో మాధవీలత వీడియో క్షమాపణ

హైదరాబాద్, ఏప్రిల్ 19
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెళ్ల మాధవీ లత ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు, ప్రచార తీరుకు సోషల్ మీడియాలో మాధవీ లతకు ఎనలేని ఆదరణ దక్కుతోంది. ఒకే ఒక్క జాతీయ స్థాయి ఇంటర్వ్యూతో ఆమె ఇటీవల ప్రధాని మోదీ దృష్టిని కూడా ఆకర్షించారు. అయితే, ఆమెకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం వివాదాస్పందంగా మారి విపరీతంగా వైరల్ అవుతోంది.పాతబస్తీలో మాధవీ లత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. అదే సమయంలో ఆమె విల్లుతో బాణం వదిలినట్లుగా అభినయించారు. ఎదురుగానే మసీదు ఉండడంతో ఆమె అలా బాణం వదలడం వివాదాలకు దారి తీసింది. మాధవీ లత మసీదు మీదకి బాణం వదులుతున్నట్లు చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.  రామ నవమి ఊరేగింపులో మాధవి లత ఏప్రిల్ 17న పాల్గొన్నారు. అప్పుడు, మాధవి అక్కడ ఉన్న మసీదు వైపు బాణం వేస్తున్నట్లు అభినయించారు.ఈ వ్యవహారంపై హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ‘‘హైదరాబాద్ ప్రజలు బీజేపీ ఉద్దేశాలు ఏంటో చూస్తున్నారు. బీజేపీ - ఆరెస్సెస్ కు చెందిన అసభ్యకరమైన, రెచ్చగొట్టే చర్యలను తిప్పికొడతారు. తరచూ బీజేపీ మాట్లాడే వికసిత్ భారత్ అంటే ఇదేనా? హైదరాబాద్ లో ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతలు ఎన్నికల కంటే ఎక్కువా? తెలంగాణ ప్రజలు మరోసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని నేను విశ్వాసంతో ఉన్నాను’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గిటివిటీని సృష్టించేందుకు నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉందని నా దృష్టికి వచ్చింది. ఇది ఒక అసంపూర్ణమైన వీడియో. అలాంటి ఈ వీడియో వల్ల మీలో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నాను. నేను అందరినీ గౌరవిస్తాను కాబట్టి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’’ అని మాధవీ లత ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

Related Posts