YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటింగ్ కుహాజరుకాని 4 లక్షలమంది.. 20 మంది ఎమ్మెల్యేలు

ఓటింగ్ కుహాజరుకాని 4 లక్షలమంది.. 20 మంది ఎమ్మెల్యేలు

కోహిమా, ఏప్రిల్ 20,
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా  దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ముగిసింది. 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తలదించుకునే సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని నాగాలాండ్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో 0% పోలింగ్ నమోదయింది. సామాన్య ప్రజలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. వారు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారేమోనని తొమ్మిది గంటల సేపు ఎదురు చూసి ఎన్నికల సిబ్బంది వెళ్లిపోయారు.నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రం. ఈ రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో నాగాలాండ్ పార్లమెంట్ స్థానం విస్తరించి ఉంది. ఇక్కడ నాగ జాతికి చెందినవారు ఎక్కువగా ఉంటారు. ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల సంఘం 738 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాగాలాండ్ రాష్ట్రంలో మొత్తం 13.25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆరు జిల్లాల పరిధిలో 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 20 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రం కావడంతో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం కేటాయించింది. ఒక్కరు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో.. సాయంత్రం పోలింగ్ సిబ్బంది వెళ్లిపోయారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు 20 మంది ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓటు వేసేందుకు ఇంత బద్ధకమా అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లను దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామంతో నాగాలాండ్ రాష్ట్రం పరువు పోయింది. ఫలితంగా ముఖ్యమంత్రి నెయిఫియా రియో స్పందించక తప్పలేదు. “ఎన్నికలవేళ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సిబ్బందిని కూడా నియమించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. మా రాష్ట్రానికి సంబంధించి ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటరీ కి స్వయం ప్రతిపత్తి కల్పించాలని అడిగాం. దీనికి సంబంధించి సిఫారసు కూడా చేశామని” ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఓటు వేయని ఆ 20 మంది ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని విలేకరులు ముఖ్యమంత్రిని ప్రశ్నించగా.. ప్రశాంతమైన తమ రాష్ట్రంలో ఘర్షణలకు తావు లేదని.. తాను అలాంటి వాటిని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. మరోవైపు ఎన్నికలవేళ బంద్ కు పిలుపునివ్వడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగాలాండ్ ఈఎన్పీవో కు  షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వయసన్ విలేకరులతో పేర్కొన్నారు.. దీనిపై ఈఎన్పీవో సపికియు స్పందిస్తూ.. షోకాజ్ నోటీస్ జారీ చేశారనే విషయం తెలిసిందని.. కాకపోతే ఈ సందర్భంలో అది వర్తించదని ఆయన పేర్కొన్నారు.

Related Posts