YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎలక్ట్రిక్ కార్ల కోసం గూగుల్ ఫీచర్

ఎలక్ట్రిక్ కార్ల కోసం గూగుల్ ఫీచర్

బెంగళూరు ఏప్రిల్ 20,
దేశంలో ఇప్పుడిప్పుడే విద్యుత్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది.ఇప్పటికే డిల్లీ,కర్ణాటక రాష్ట్రాల్లో వీటి వినియోగం అధికమైంది. ప్రజలు కూడా వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. పర్యావరణ హితం కావటంతో చాలా మంది విద్యుత్ కార్లపై ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అయితే సాధారణ వాహనాలకు పెట్రోల్ బంకుల మాదిరిగానే వీటికి ఛార్జింగ్ స్టేషన్లు అధికమవుతున్నాయి. అయితే దూర ప్రయాణాలకు వెళ్తున్న  వినియోగదారులకు ఛార్జింగా స్టేషన్లు ఎక్కడ ఉన్నాయని వెతకటం ప్రధాన సమస్యగా మారింది.  ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఎప్పటికప్పుడు యూసర్ల అవసరాల దృష్ట్యా కొత్త ఫీచర్లను గూగుల్ మ్యాప్స్ తీసుకువస్తుంది.ఇప్పుడు అలాంటిదే విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను వెతకటం కోసం న్యూ ఫీచర్ ను తీసుకువచ్చింది. గూగుల్ మ్యాప్స్ లోని ఏఐ సాయంతో ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లను వెతకటానికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ఒకవేళ కారులో వెళ్తున్నప్పుడు ఛార్జింగ్ తక్కువగా ఉంటే గూగుల్ తీసుకువచ్చిన ఈ ఫీచర్ల లో వాటంతటికి అవే మనకు తెలియజేస్తాయి. దూరప్రయాణాలకు వెళ్లేటప్పుడు కూడా ఎప్పుడెప్పుడు   ఛార్జింగ్ చేయాలో కూడా దానంతటా అవే సూచిస్తాయి.దీన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. మొదట ఈ సౌకర్యాలను గూగుల్ బిల్డ్-ఇన్ ఉన్న వాహనాలకు తీసుకువస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.

Related Posts