YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కాబూల్‌లో ఉగ్రవాదులు నరమేధం

కాబూల్‌లో ఉగ్రవాదులు నరమేధం

-  మరో ఉగ్రదాడి -  63 మంది దుర్మరణం

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. విదేశీ ఎంబసీలు, ప్రభుత్వ భవనాలకు సమీపంలోని పోలీసు చెక్‌పాయింట్ వద్ద ఓ అంబులెన్స్‌లో శనివారం భారీ శబ్ధంతో బాంబు పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 63కి చేరగా, కనీసం 151 మందికిపైగా గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో బాంబు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అంతర్గత వ్యవహారాల ప్రతినిధి నస్రాత్ రహ్మి మీడియాకు వెల్లడించారు. 


ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌పై దాడిచేసింది తామేనని తాలిబన్ ప్రకటించుకున్న వారంలోపే ఈ భారీ పేలుడు సంభవించడం కాబూల్‌లో ఇది రెండోసారి. ఈ దాడి కూడా ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలను వేగవంతం చేశాయి. పేలుడు ఘటనలో డజన్లకు పైగా గాయపడగా, క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఇటాలీయన్ ఎన్‌జీఓ అత్యవసర విభాగం పేర్కొంది. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకూ ఓ ఉగ్రవాద సంస్థ తామే దాడిచేసినట్టుగా ప్రకటించుకోలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

 భారత్ తీవ్రంగా ఖండన..

. అమాయక ప్రజలను లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న ముష్కరులను మట్టుబెట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఈఎ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘ఇలాంటి ఉగ్రదాడులను ఎంతమాత్రం సహించేది లేదు. అప్ఘానిస్థాన్‌కు భారత్ సాధ్యమైనంత వరకు అన్నివిధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ’ అని ఎంఈఏ పేర్కొంది. అఫ్ఘానిస్థాన్ ప్రజలకు భారత్ సంఘీభావం తెలిపింది. కాగా, కాబూల్‌లోని పోలీసు చెక్ పాయింట్ వద్ద అంబులెన్స్‌లో అమర్చిన బాంబు పేలడంతో 61 మంది దుర్మరణం చెందగా, 151 మందికిపైగా ప్రజలు గాయాపడ్డారు. ఈ బాంబు దాడి తమ పనేనని తాలిబన్ ప్రకటించుకునట్టు రాయిటర్స్ నివేదించింది

Related Posts