YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాటి సంగతి హామీలపై ఫ్యాన్ లో ఉక్కపోత

వాటి సంగతి హామీలపై ఫ్యాన్ లో ఉక్కపోత

విజయవాడ, ఏప్రిల్ 26,
అధికార పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. దానికి కారణం అప్పటికే వారు ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయకుండా విశ్వాసం కోల్పోయి ఉంటారు. రాజకీయ పార్టీలు వందల హామీలు ఇస్తూ ఉంటాయి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎవరు ఏమి అడిగినా అది సాధ్యమా కాదా అని ఆలోచించకుండా అధికారంలోకి రాగానే చేస్తామంటాయి. చాలా వరకూ మేనిఫెస్టోల్లో పెడతాయి. అందుకే తదుపరి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అనేక పార్టీలు  కొత్త హామీల విషయంలో అంత చురుకుగా ఉండలేవు. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి కూడా అంతే. నామినేషన్ల గడువు  ముగిసినా ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు. ఇప్పుడు మేనిపెస్టో ప్రకటిస్తే.. అమలులో ఉన్న మేనిఫెస్టోలో అమలు చేయని  వాటి సంగతి చెప్పాలన్నడిమాండ్లు వస్తాయి. ప్రజాబాహుళ్యంలో జగన్ హామీలు ఇచ్చి.. మేనిపెస్టోలో పెట్టిన అనేక  అంశాలు అమలు కాలేదు. వాటిపై ఇప్పుడు చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తనకు మనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెబుతారు. “ కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమై పోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుదశల్లో మద్యాన్ని నిఫేధిస్తాం. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం,” అని మేనిఫెస్టోలో ఉంది. అంతకు ముందు జగన్ రెడ్డి మద్య నిషేధంపై చేసిన ప్రసంగాలు చూసిన ఎరికైనా.. చేసేస్తాడని అనుకునేవారు.   ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక మద్య పాన నిషేధం అంచెలంచెలగా అంటూ ఏవో జీవో లు జారీ చేశారు. కానీ పాలసీ మార్చి.. దుకాణాలన్నీ చేతుల్లోకి తీసుకున్నారు. ఏటా ఇరవై శాతం దుకాణాలు తగ్గిస్తామన్నారు. మద్య నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని సవాల్ చేశారు. సీఎం జగన్ అదే మాట అన్నారు. మహిళా నేతలతోనూ చెప్పించారు. కానీ ఇప్పుడు మద్య నిషేధం గురించి మాట్లాడటం లేదు. మళ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు ఈ మద్యనిషేధం హామీని ఎగ్గొట్టడంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండున్నర లక్షలకుపైగా ఖాళీగా ఉన్నాయని తాను రాగానే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. చంద్రబాబు హయాంలో మూడు డీఎస్సీలు వేస్తే కొద్ది పోస్టులే భర్తీ చేస్తున్నారని.. తాను రాగానే మెగా డీఎస్సీ అన్నారు. ఐదేళ్లలో ఒక్క సారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు.  ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. టీచర్ల పోస్టుల భర్తీ విషయంలో అసలు ఎలాంటి ఆలోచన చేయలేదు. ఎన్నికలకు ముందు డీఎస్సీ వేశారు కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడంతో కోర్టు కేసులతో ఆగిపోయింది. నిరుద్యోగుల పరీక్ష ఫీజు ప్రభుత్వం  వద్ద ఉండిపోయింది. దీనికి నిరుద్యోగ యువతకు ఏం  సమాధానం ఇస్తారు ?  అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు ”  అని జగన్ ప్రకటించారు. మేనిపెస్టోలోనూ పెట్టారు. కానీ సీపీఎస్ రద్దుపై జగన్ రెడ్డికి అవగాహన లేక హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను దెబ్బతీసింది. ఇచ్చిన హామీలు అమల చేయకోపతే రాజీనామా చేసి పోవాలనే మంచి రాజకీయ సంస్కృతి రావాలని ఆయన రాజకీయ ప్రసంగాల్లో చెప్పేవారు. ఇప్పుడు అవగాహన లేక హామీలు ఇచ్చానని కారణం  చెప్పడం అంటే.. ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. పైగా వచ్చే ప్రభుత్వాలు కూడా సీపీఎస్ రద్దు చేయకుండా ఆ కంట్రిబ్యూషన్ పై పెద్ద ఎత్తున అప్పులు తెచ్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అగ్రిగోల్డ్ బాధితులకూ రూ. 1150 కోట్లు ఇవ్వడం దగ్గర్నుంచి ఎస్సీ, ఎస్టీలు సహా అనేక పథకాలను స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించినా జగన్ఇవ్వలేదు. రైతులకు రూ. 12500 ఒకే సారి మే నెలలో ఇస్తామన్‌నారు. తర్వాత కేంద్రం ఇచ్చే రూ. ఆరు వేలు తీసేసి ఆరున్నర వేలు ఇస్తున్నారు. అయితే ఒక వేయి పెంచారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడున్నర  వేలే ఇస్తుంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఈ రైతు భరోసా కింద రూ. పన్నెండున్నర వేలు ప్రకటించినప్పుడు.. కేంద్రం పీఎం కిసాన్ పథకం ప్రవేశ పెట్టలేదు. అయినా రైతులకు ఇచ్చిన హామీని విస్మరించారు.  ఏటా డిఎస్‌సీ మాటలేదు.. కోల్డ్ స్టోరేజ్, పంటలకు గిట్టుబాటు ధర, జర్నలిస్టులకు ఇల్లు, వృద్ధాశ్రమం, ఇస్లామిక్ బ్యాంకులు, కొత్త పరిశ్రమలు ఇవన్నీ అమలు చేయలేదని టీడీపీ అంటోంది.
వైఎస్ఆర్‌సీపీ నేతలు తాము ఇచ్చిన హమీల్ని 99 శాతం అమలు చేశామని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే.. మాట తప్పం.. మడమ తిప్పం అనే ట్యాగ్ లైన్ తో గత ఎన్నికల్లో ప్రజల్ని గట్టిగా నమ్మించారు. అనేకవర్గాల్లో భరోసా కల్పించారు. ముఖ్యంగా ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, యువకులకు జాబ్ క్యాలెండ్ అంశాలు బాగా ఆకర్షణీయంగా మారాయి. మహిళలకు  మద్య నిషేధం హామీ  ఓట్ల వర్షం కురిపించిందని చెబుతారు. అయితే ప్రధానమైన హామీల విషయంలో అనుకున్న విధంగా చేయకపోవడంతో.. విపక్షాలు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. వైసీపీ కొత్త మేనిఫెస్టోను ప్రజలు నమ్మాలంటే.. ఇప్పటికే అమల్లో ఉన్న మేనిఫెస్టోలో .. అమలు చేయలేకపోయిన  హామీలపై .. ప్రజలకు సంతృప్తి కరమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

Related Posts