YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ కాదు... రేవంత్ టార్గెట్

కాంగ్రెస్ కాదు... రేవంత్ టార్గెట్

హైదరాబాద్, ఏప్రిల్ 26
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోణపు పోరాటంలా సాగుతున్నాయి. పైకి ఇలా కనిపిస్తున్నా జరుగుతున్న రాజకీయాన్ని చూస్తే మాత్రం..  రేవంత్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోరాటం జరుగుతోంది. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడం లేదు. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాయి.  రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరని ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా తనపై బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నాయని పాలమూరు బిడ్డ సీఎం పదవిలో ఉండకుండా చేసేందుకు  కలిసిపోయారని అంటున్నారు  రేవంత్ రెడ్డి ఆ రెండు పార్టీలు చేస్తున్న రాజకీయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డే ప్రమాదకరంగా బీజేపీ, బీఆర్ఎస్ భావిస్తున్నాయా ? హామీలు అమలు చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ చేశారు. రెడీ అని రేవంత్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో చెప్పలేనని కేసీఆర్ అంటున్నారు. తనతో పాతిక మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు. కానీ తాము ప్రభుత్వాన్ని పడగొడతామని ఆయన చెప్పడం లేదు. బీజేపీ పడగొడుతుందని జోస్యం చెబుతున్నారు. అగ్రనేతలే కాదు.. కేటీయార్, హరీష్ రావు, బీజేపీలో జీ కిషన్ రెడ్డి మొదలుకుని బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఏలేటి మహేశ్వరరెడ్డి, రఘునందనరావుకు ప్రతిరోజు రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కంటే రేవంత్ ను టార్గెట్ చేయడం  ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని  రెండు ప్రదాన పార్టీలు టార్గెట్ చేస్తున్నాయంటే.. ఆయన బలం పెరిగిందనే అర్థం. నిజానికి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి. ఆ పార్టీపై వ్యతిరేకత పెంచాలి. కానీ రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెంచితే చాలని  విజయం వస్తుందని..ఓటర్లు మారిపోతారని బీఆర్ఎస్, బీజేపీ అనుకుంటున్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనను టార్గెట్ చేస్తున్నారని అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు .ఓ వైపు పీసీసీ చీఫ్ గా మరో వైపు సీఎంగా రెండు బాధ్యతల్ని  నిర్వర్తిస్తున్నారు. కింది నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డికి  ఆ సామర్థ్యం ఉంది.  కష్టపడి అనేకమంది ప్రత్యర్ధులను ఎదుర్కొని చాకచక్యంతో  సందర్భానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి ఎదిగారు రేవంత్రెడ్డి. గ్రూపులకు నిలయమైన కాంగ్రెస్ లో చేరిన  కొద్ది కాలంలోనే  ముఖ్యమంత్రి అయ్యారు.  చెప్పదలచుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పటం, విషయ పరిజ్ఞానం ఉండటం, జనాలకు ఆకట్టుకునే వాగ్ధాటి ఉండటం రేవంత్ స్టైల్. అందుకే ఆయన ప్రజల్లో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై ప్రజల్లో ఆదరణ ఉన్నా .. ఏకతాటిపైకి నడిపించే నాయకుడు లేకపోవడం వల్లనే రెండు సార్లు ఓడిపోయిందన్న అభిప్రాయం ఉంది. మూడో సారి ఎన్నికలు జరిగేనాటికి ఆ లోటును రేవంత్ రెడ్డి తీర్చేశారు. తనకు పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వడంపై పార్టీలో వ్యతిరేకత వచ్చినా ఆయన సమన్వయంతో సరి చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా ఆయన అంతే అందర్నీ కలుపుకుని వెళ్లారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు కూడా ఆయనే పదేళ్లుగా సీఎంగా ఉంటారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడే చాణక్యం చూపిస్తూ ఉంటారు. నల్లగొండ పర్యటనకు వెళ్లి.. కోమటిరెడ్డికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని చెబుతూ ఉంటారు. ఇలా నొప్పింపక ..తానొవ్వక అన్న పద్దతిలో రేవంత్ రెడ్డి పార్టీలో పట్టు పెంచుకుంటూ ప్రజల్లో పలుకుబడి పెంచుకుంటూ ఇతర పార్టీలకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు.  రేవంత్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని ఒకరు, లోక్ సభ ఎన్నిక లవుతూనే రేవంత్ పతనం మొదలవుతుందని మరొకరు, ఒక  ఏడాది కంటే రేవంత్ ప్రభుత్వం కొనసాగదని ఇంకొకరు రేవంత్ పతనం కాంక్షిస్తున్నారు.రేవంత్అంతకు మించి కొనసాగితే తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని వీళ్లంతా భయపడుతున్నారన్న కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.   బీజేపీ నేతలు కిషన్, బండి, రఘునందన్ ఇలా ప్రతిఒక్కరు ప్రతిరోజు రేవంత్ జపమే చేస్తున్నారు. తమ ఆరోపణలు, విమర్శలన్నింటినీ రేవంత్ ప్రధానంగానే చేస్తున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, పార్టీని రేవంత్ చీల్చేస్తాడని, రేవంత్ తెలంగాణా షిండే అయిపోతాడని  కాంగ్రెస్ లో ఆయనపై నమ్మకం తగ్గించే వ్యూహం అమలు చేస్తున్నారు. వీరు ఎన్ని చేసినా రేవంత్ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పది కిపైగా పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే రేవంత్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు మరింత ఎక్కువగా రేవంత్ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్లుగానే రాజకీయం మారుతుంది. రేవంత్ నీడలోనే కాంగ్రెస్ ఉండిపోతుంది.    

Related Posts