YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రభాకర్ రావు కి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదు

ప్రభాకర్ రావు కి  రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదు

హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్ కొత్తకొట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రావు కి  రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదు. ఊహాగానాలు తో దర్యాప్తు ను ఇబ్బంది పరుస్తున్నారు. రాజకీయ నేతల ప్రమేయం పై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభాకర్ రావు ను పట్టుకోవడం లేదనేది వార్త అవాస్తవం ప్రభాకర్ దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదు సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని అన్నారు
మాజీ ఇంటలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు ఎక్కడున్నాడో ఇప్పటివరకు తెలియదు. ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్ గా, ఇంటలిజెంట్ గా వ్యవహరించారు. మా శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నాం. వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా టాపింగ్ చేశారు. వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించడం అనేది ఘోరమైన నేరం. నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ప్రమేయం ఉంది అరెస్ట్ చేశాము. ఈ కేసులో మరి కొంత మంది పోలీసులను సాక్షులగా పెట్టాము. సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని అన్నారు.

Related Posts