YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూలై నుంచి వందే మెట్రో...

జూలై నుంచి వందే మెట్రో...

ముంబై, మే 2,
సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైళ్లతో భారీ విజయం సాధించిన ఇండియన్‌ రైల్వే దేశంలో మొదటి వందే మెట్రోను కూడా ప్రారంభించాలని భావిస్తోంది. ఇంట్రాసిటీ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్‌ను మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ సీనియర్‌ అధికారి ఈ విషయం వెల్లడించారు.అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ జూలై నుంచి వందే మెట్రో ట్రయల్‌ రన్‌ ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. దీని సేవలను వీలైనంత త్వగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటోంది. క్షణాల్లో వేగాన్ని అందుకునేలా, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లను కవర్‌ చేసేలా ఆధునిక టెక్నాలజీతోపాటు మరిన్ని ఫీచర్లు ఈ వందే మెట్రోలో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.రైల్వే వర్గాల సమాచారం ప్రకారం వందే మెట్రో రైళ్లు ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్‌ కలిగి ఉంటాయి. దీనిలో నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్‌లు ఒక వందే మెట్రోలో ఉంటాయి. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్య 16కు పెంచుకునేలా దీనిని రూపొందించారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్లు పట్టాలపై పరుగులు పెడతున్నాయి. మేకిన్‌ ఇండియాలో భాగంగా తయారు చేసిన ఈ ప్రాజెక్టు సక్సె కావడంతోపాటు, పట్టాలపై రైళ్ల వేగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో వందే భారత్‌ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత రైల్వే.. వందే మెట్రో ప్రాజెక్టు సిద్దం చేస్తోంది. వందే భారత్‌ రైళ్లకన్నా మెరుగైన సదుపాయాలు, ఎక్కువ వేగంగా ప్రయాణించేలా దీనిని రూపొందిస్తున్నారు

Related Posts