
వ్యభిచారగృహాన్నినిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తమిళ సినీనటి సంగీత బాలన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సంగీత బాలన్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులు 'సహా పలువురు మహిళలను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. మహిళలంతా ఉత్తర భారతానికి చెందిన వారిగా గుర్తించి.. వారిని వ్యభిచారం గృహం నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు.