
ముంబాయి
లోక్సభ ఐదో విడత ఎన్నికల పోలింగ్ లో ప్రముఖనటి శ్రీదేవి కూతురు 'జాన్వీ కపూర్' తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జాన్వీ కపూర్.. ప్రస్తుతం తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా.