YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాష్ట్రం లో మద్యపానాన్ని నిషేధించాలి

రాష్ట్రం లో మద్యపానాన్ని నిషేధించాలి

హైదరాబాద్ మే 29
రాష్ట్రంలో సంపూర్ణ మధ్యపా నిషేధాన్ని అవలంబించాలని అప్పుడే రాష్ట్రంలో ప్రతి  కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తాయని కావున వెంటనే మద్యపానాన్ని నిషేధించి తెలంగాణ రాష్ట్రాల్లో మహిళా అభ్యున్నతికి పాటుపడాలని ప్రభుత్వానికి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సింగం శ్రీనివాస్ రావు గారు సూచించారు మంగళవారం 28.05.2024 ఐపీసీ క్యాంప్ ఆఫీస్ లిబర్టీ ప్లాజా బషీర్బాగ్ హైదరాబాద్ కు విచ్చేసి కార్య వర్గ సభ్యులను కలిసి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటుందని కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు ఈ సందర్భంగా డాక్టర్ సింగం శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ మద్యపానం వల్ల ఎంతో మంది యువకులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని వారితో పాటు ఎన్నో కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఈ సమస్యను పరిష్కరించాలంటే మద్యపాననిషేధమే సరైన మార్గం అని తెలిపారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మద్యపాననిషేధానికి కట్టుబడి ఉంటుందని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మద్యపానం వల్ల జరిగే నష్టాలను లిఖితపూర్వకంగా వినతి పత్రాన్ని సమర్పిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 15 నుంచి శాంతియుత ప్రజా ఉద్యమాన్ని మొదలు పెడతామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యటించి మాతృ ప్రేమతో పరిపాలన అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న ఐపీసీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ మాట్లాడుతూ గుజరాత్ లో లాగానే ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా మద్యపానం నిషేధించి మహిళా అభ్యున్నతి పాటుపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూచించారు కార్యక్రమంలో అడ్వైజర్ అనిత హరి సేవాదళ్  విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పుష్పాంజలి గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షులు నవీన్ కార్యవర్గ సభ్యులు సత్య నరసింహ గుప్తా కనకదుర్గ ఐపిసి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ నందికొండలరావు తదితరులు పాల్గొన్నారు

Related Posts