YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆస్తి-పాస్తులు

రాజాం లో పెట్టుబడి రాజధానికి సమానం...!

రాజాం లో పెట్టుబడి రాజధానికి సమానం...!

- ఆదివారం రాష్ట్ర మంత్రి కిమిడి కళావెంకట రావు శంకుస్థాపన చేస్తున్నారు.

 నూతన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరాలను ఒక అంతర్జాతీయ సంస్థ సర్వే చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జనాభా, వాళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని సర్వే నిర్వహించారు. ప్రజల జీవన పరిణామాలు, అక్కడ ఉన్న, విద్య,ఉద్యోగ, వ్యాపార పరిస్థితులను లెక్క చేసి ముఖ్యంగా సాగిన సర్వే ఉత్తరాంద్ర జిల్లాలో ఒకే ఒక్క ప్రాంతానికి చోటు లభించింది. శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్త జి. ఎం. ఆర్. చేసిన కృషి ఈ రాజాం అభివృద్ధి అని చెప్పవచ్చు. గత పది సంవత్సరాలుగా అత్యంత వేగంగా అబిగివృద్ది చెందిన ద్వితీయ శ్రేణి నగరాలలో రాజాం కి చోటు లభించింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిశ్రమలు రాష్ట్రం లో ఎక్కడా లేవంటే అతిశయోక్తి కాదు.ఇక్కడ జరుగుతున్న స్థిరాస్తి వ్యాపార లావాదేవీలను మనం గమనిస్తే కళ్ళు చెదిరే నిజాలు కనిపిస్తాయి. ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయిన కొన్ని రోజులు రద్దీగా ఉంటాయి. కానీ ఇక్కడ గాని చూస్తే ప్రభుత్య సెలవు దినాలు మినహా, ఎప్పుడు చూసినా ,అక్కడ ఉత్సవాలు జరిగే సందడిలా కనిపిస్తారు ప్రజలు. ఏమైనా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం తరువాత అంత స్థాయి నగరం ఏదైనా ఉందంటే అది రాజాం అని చెప్పక తప్పదు. అన్ని వర్గాలకు, అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు.

Related Posts