అమరావతి
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ ప్రయాణానికి కోర్టు బ్రేక్ వేసింది. సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్ పోర్ట్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయన జనరల్ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసారు. అయన తరపు లాయర్లు ఐదు సంవత్సరాలు పాటు పాస్పోర్ట్ అనుమతి ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. ఒక ఏడాది పాటు పాస్ పోర్ట్ ఇవ్వాలని విజయవాడ కోర్ట్ ఆదేశించింది. జగన్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.