
తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కు ప్రతిపక్షాల సెగ తగిలింది. ఓ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితి భవనం ప్రారంభం కొరకు వచ్చిన మంత్రిని కాంగ్రెస్ నాయకులు గ్రామా సమస్యల పై నిలదీయడం జరిగింది. పంచాయితీ భవనం ముందు మంత్రి జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొంత సేపు గందరగోళం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయితి భవనం ప్రారంభం కొసం తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రావటంతో ప్రతిపక్షాలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన పంచాయితీ భవనం ప్రారంభం తరువాత మంత్రి జూపల్లి మైక్ తీసుకొన్ని మాట్లాడే క్రమంలో ఈ గొడవ ప్రారంభం అయింది. కాంగ్రెస్ నాయకులు భాస్కర్, శ్రీను మరి కొంత మంది కార్యకర్తలు పంచాయితీ భవనం దగ్గరకు చేరుకొని గ్రామంలో ఉన్న సమస్యలు పరిస్కరించలన్ని మంత్రి తో గొడవకు దిగారు. కొన్ని ఏండ్ల నుండి ఉన్న జిల్దార్ తిప్పాకు నీళ్ళు ఇస్తున్నామని కాలయాపన చేస్తూ మమ్ములను ఇబ్బంది పెడుతున్నారన్ని ఆరోపించారు. వ్యవసాయ పొలాలకు నీళ్ళు లేక, కెఎల్ఐ ప్రాజెక్ట్ ద్వారా వస్తాయన్ని చెప్పి కాలయాపన చేయడం ఏమిటని మంత్రిని నిలదీశారు. రోడ్డు, యస్.సి లకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్ల ఎక్కడ అన్ని మంత్రిని నిలదీశారు. ఓపికతో వారి సమస్యలు విన్న మంత్రి మీ సమస్యలు ఇంకా రెండు నెలలో పరిష్కారం చేస్తానని హమినిచ్చారు. ఆరవై ఏళ్ల పాలన చేసిన పార్టీలు చేయాని అభివృద్దిని, మేం నాలుగు ఎళ్లలో చేయడం జరిగిందని అయన అన్నారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని వారికి మంత్రి తెలిపారు.