
వరుసగా 11వ రోజు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయ్. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ ఇంధన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా శనివారం లీటర్ పెట్రోల్పై 40 నుంచి 42 పైసలు ధర తగ్గగా, డీజిల్పై 30 నుంచి 32 పైసలు ధర తగ్గింది. మారిన రేట్ల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
నగరం పెట్రోలు (రూ.) డీజిల్ (రూ.)
న్యూఢిల్లీ 77.02 68.28
కోల్కత 79.68 70.83
ముంబయి 84.84 72.70
చెన్నై 79.95 72.08
హైదరాబాద్ 81.59 74.22
బెంగుళూరు 78.27 69.45