
పాలకుర్తి నియోజకవర్గంలో ఉపాధి హామీ నిధులతో పాటు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా విడుదలైన నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలోని ఆయన నివాసంలో అధికారులతో గ్రామాల వారిగా సమీక్షించారు. గ్రామాల్లో చేపట్టిన అంతర్గత సిసి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు, బిటి రోడ్ల నిర్మాణాల ఆలస్యం పట్ల అగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, గుత్తేదారులు గ్రామాల్లో సిసి రోడ్లను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్దికి నిధులు తీసుకోచ్చేందుకు అహర్నిషలు కృషిచేస్తుంటే.. పనులు పొందిన గుత్తేదారులు ఆలస్యం చేయడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం పట్ల అసహానం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పీఆర్ డీఈలు, ఏఈలు, మండల నాయకులు నాగిరెడ్డి, రాంబాబు, యాకాంతరావు, నర్సింహానాయక్, తదితరులు పాల్గొన్నారు.