
నవనిర్మాణ దీక్ష విజయవంతమైంది. 4 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈనాలుగేళ్ల పాలన సంతృప్తిని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పాలన పై ప్రజలకు సంతృప్తి పెరిగింది. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశాం,వీధుల్లో ఎల్ఈడి లైట్స్ పెట్టామని అన్నారు. పెదవారి కళ్లలో ఆనందం చూసాను. 19లక్షల ఇళ్లు కడుతున్నాం. ఆరు వేల పాఠశాలలో వర్చువల్ తరగతులు వచ్చాయి. 7.25 లక్షల ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 2మీటర్ గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగిందని అన్నారు