
హైదరాబాద్ మాదాపూర్ లో విశాఖకు చెందిన సుష్మ (27) అనే యువతి ఆత్మహత్యచేసుకుంది. షేరు మార్కెట్ వ్యాపారం లో ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సుష్మ షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ముంబయి నుంచి హైదరాబాద్ కు వచ్చిన సుష్మ, శనివారం మాదాపూర్ లోని హోటల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.