YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇజ్రాయెల్‌లో అతి పురాతన అస్థిపంజరం..

ఇజ్రాయెల్‌లో అతి పురాతన అస్థిపంజరం..

- 40 వేల నుంచి 50 వేల సంవత్సరాల క్రితంది..

- ఇజ్రాయెల్‌లోని గుహలలో గుర్తింపు..

ఆదిమ మానవుడి పరిణామక్రమం గురించి తెలియజేసే అతి పురాతన అస్థిపంజరం ఒకటి ఇజ్రాయెల్‌లో బయటపడింది. ఆఫ్రికా నుంచి ఆదిమ మానవుడు ఎప్పుడు బయటి ప్రాంతాలకు వెళ్లాడనే విషయాన్ని ఈ అస్థిపంజరం తెలియజేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మానవ శిలాజాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత దాదాపు 40 వేల నుంచి 50 వేల సంవత్సరాల క్రితం ఈ పరిణామం చోటుచేసుకుని ఉంటుందని వారు తేల్చారు.

మిస్లియా గుహ...
మిస్లియా-1 గా వ్యవహరిస్తున్న ఈ శిలాజం 1,77,000 నుంచి 1,94,000 సంవ త్సరాల నాటిదని పరిశోధకుల అంచనా! సుమారు 2,20,000ల సంవత్సరాల క్రితం హోమో సేపియన్ల వికేంద్రీకరణకు సంబం దించి కారణాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఇటీవలి జన్యు పరిశోధనలు దీనికి దోహదపడతాయని భావిస్తున్నారు.


త్రీడీలో పునర్నిర్మించిన మిస్లియా-1..
ఆధునిక యుగం ప్రారంభం నాటి మానవ శిలాజాలు దొరికిన ప్రాంతాలు..
మిస్లియా 1,77,000 నుంచి 1,94,000ల మధ్య 
మిస్లియా-1కు ముందు ఆధునిక మానవుడి పూర్వీకుల శిలాజాలను ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో బయట పడ్డాయి. వాటిని పరిశీలించగా.. అవ న్నీ 90వేల సంవత్సరాల నుంచి 1.20 లక్షల సంవత్సరాల క్రితం నాటివని తేలింది. ఇవి ఆఫ్రికాలోని స్కుల్ అండ్ కాఫ్జే తదితర చోట్ల బయటపడ్డాయి.
కాఫ్జే 6 శిలాజం
మిస్లియా-1 సమీపంలో బయటపడ్డ రాతి పని ముట్లు.. ఇవన్నీ లెవల్లా యిస్ విధానంలో ఉండడం గమనిస్తే హోమో సేపియన్లకు అప్పట్లోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం ఉందని నమ్మకతప్పదు.

Related Posts