YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్

మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్

హైదరాబాద్, నవంబర్ 30,
తెలంగాణలో మందు విక్రయాలు తారాస్థాయికి మించి పోయాయి. ఒకరకంగా ఏరులై పారుతుంది అనుకోవచ్చు. సగటున తొమ్మిది లీటర్ల మద్యాన్ని తెలంగాణ ప్రజలు తాగుతున్నారట. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం ప్రధాన వనరుగా మారింది. రాష్ట్ర బడ్జెట్లో మద్యం ద్వారా 12 శాతం సమకూరుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ప్రపంచంలో అమ్మే ప్రతి మూడు విస్కీ సీసాలలో… హాఫ్ బాటిల్ హైదరాబాదులో అమ్ముతున్నారంటే మామూలు విషయం కాదు. ఆరోగ్య నిపుణుల అంచనా ప్రకారం తెలంగాణలో మద్యం వినియోగం తారాస్థాయిని ఎప్పుడో దాటిపోయింది. వైద్య పరిభాషలో దీనిని మోడరేట్ రిస్క్ అంటారు. ఇదే విషయాన్ని ఇటీవల బ్రిటిష్ మెడికల్ జర్నల్ కూడా పేర్కొంది. భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ.. ప్రభుత్వ ఖజానాపై ఉన్న ఒత్తిడి నేపథ్యంలో డిస్టిలరీలు, బ్రూవరీల కోసం మరోసారి ధరలు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ధరల నిర్ణయానికి ఒక కంపెనీ కూడా నియమించింది.. ఈ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది.. అయితే ఆ నివేదికలో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక కంటే తెలంగాణ లోనే మందు విక్రయాలు ఎక్కువ అని తేలింది.. మందు వినియోగం మాత్రమే కాదు దాని ద్వారా వచ్చే ఆదాయంలోనూ తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం తెలంగాణ జనాభా 3.5 కోట్లు.. ఈ ఏడాది నవంబర్ నాటికి 35,589 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. వీటి ప్రకారం చూసుకుంటే తలసరి లిక్కర్ వినియోగం 9 లీటర్లుగా నమోదయింది. ఇక బీర్ల వినియోగం 10.7 లీటర్లుగా ఉంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం బ్రాండ్లు కాకుండా.. ఇతర కంపెనీల ఉత్పత్తులను విక్రయించింది. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం షాపుల విషయంలో టెండర్లు ఆహ్వానించింది. స్థానిక కంపెనీల ఉత్పత్తులను పక్కనపెట్టి, మందుబాబులు తాగే బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు 23 వేల 804 కోట్ల ఆదాయం వచ్చింది.. ఇది కేవలం నవంబర్ నెల నాటి వరకే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 4.93 కోట్ల జనాభా ఉంది. ఇక్కడ తలసరిగా 6.4 లీటర్ల మద్యం వినియోగం ఉంది..జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఇటీవల నిర్వహించిన సర్వేలో గ్రామాలలో అత్యధికంగా మద్యం వినియోగం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.. జాతీయ తలసరి మద్యం వినియోగం 5.6% కాగా.. దేశ సగటు 9.9 శాతంగా నమోదయింది. తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే ఇది 10% ఎక్కువగా నమోదయింది. తెలంగాణలో మద్యం తాగే వారి సగటు 19 శాతం ఉంది. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో అదనంగా మూడు శాతం మద్యం తాగుతున్నారు. మద్యానికి అలవాటు పడే వారి సంఖ్య పట్టణాలలో తగ్గుముఖం పడుతుండగా.. గ్రామాలలో పెరుగుతోంది..ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం 45 శాతం మద్యం విక్రయాలు దక్షిణాది రాష్ట్రాలలోని సాగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో మద్యం విక్రయాలు అధికంగా ఉన్నాయి. అయితే వీటిల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. మద్యం వినియోగం అధికంగా ఉండడం వల్ల లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా ఈ బాధితులు తెలంగాణలో పెరుగుతున్నారు. లివర్ సిరోసిస్ వ్యాధి బారిన పడి.. అది అంతిమంగా కాలేయ వైఫల్యానికి దారితీస్తోంది. కాలేయం వైఫల్యం అయిందంటే అది కచ్చితంగా గుండెపోటుకు కారణం అవుతుంది. చివరికి అది మరణానికి దారితీస్తుంది. ఇటీవల ఈ తరహా మరణాలు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోయాయి.

Related Posts