YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

95 ఎకరాల్లో ఎకో పార్క్

95 ఎకరాల్లో ఎకో పార్క్

హైదరాబాద్, నవంబర్ 30,
హైదరాబాద్ నగర శివారులో నిర్మిస్తున్న కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. డిసెంబరు 9న ఈ ఎకో పార్క్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకొని సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎకో పార్కును నిర్మిస్తున్నారు. ఈ పార్కులో తొలిదశ పనులు పూర్తయ్యాయి.ఫస్ట్ ఫేజ్‌లో ఎకో పార్కులో పక్షుల గ్యాలరీ, ఎలివేటెడ్‌ వాక్‌వే, వివిధ రకాల పూల మొక్కలతో ఉన్న పార్క్, బటర్‌ఫ్లై పార్క్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గార్డెన్ అందుబాటులోకి రానున్నాయి. సెకండ్ ఫేజ్‌ కింద థీమ్‌ పార్కులు, అక్వేరియం, ఇతర ప్రకృతి అందాలను పర్యాటకులకు మధురానుభూతిని పంచనున్నాయి.ఈ పార్క్‌లో 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏలివేటెడ్‌ వాక్‌ ఏరియా ఉంది. సముద్ర జీవులతో అక్వేరియం ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ రిసార్టు, మినీ కన్వెన్షన్‌ సెంటర్‌‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రకృతి రమణీమైన ల్యాండ్‌స్కేపింగ్‌ ఇక్కడ స్పెషల్ అని చెప్పాలి. వివిధ రకాల ఆటలు, సాహసాలతో అడ్వెంచర్‌ జోన్‌‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.ఈ ఎకో పార్క్‌కు 2022 అక్టోబర్ 12న నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన్ చేశారు. దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని, ఇది నగర ప్రజలకు అహ్లాదాన్ని పంచుతుందని కేటీఆర్‌ అప్పట్లో వెల్లడించారు. నీటిలో నడిచే అనుభూతి ఉండేలా హిమాయత్‌ సాగర్‌పై ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్వాల్‌గూడ వద్ద 85 ఎకరాల్లో రూ.75 కోట్లతో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ బడ్జెట్ కాస్త.. రూ.300 కోట్లకు పెరిగింది.
ఐటీ కారిడార్‌, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్‌ రింగురోడ్డును ఆనుకొని దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌, గుట్టల మధ్య హాయిగా నడిచేందుకు బోర్డు వాక్‌తో పాటు దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవీయరీ (పక్షి శాల) కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టారు.

Related Posts