YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

లాడెన్...37 మందిని చంపేసింది

 లాడెన్...37 మందిని చంపేసింది
అసోంలోని గోల్‌పార ఫారెస్ట్ డివిజన్‌లో ‘లాడెన్’ దాడిలో ఇప్పటివరకూ 37 మంది మృత్యువాత పడ్డారు. 2016 నుంచి అటవీ ప్రాంతంలో నివసించే గ్రామస్తుల ప్రాణాలను బలితీసుకోంటోంది. అతిభారీ కాయంతో కనిపించే ఈ ఏనుగును చూడగానే పై ప్రాణాలే పైనే పోవాల్సిందే. అలా గ్రామాల్లోకి ప్రవేశించిన ఏనుగులను తిరిగి అసోంలోకి తరిమికొట్టేందుకు అక్కడి గ్రామస్తులు ప్రయత్నించడంతో ఈ సమస్య మరింతగా జటిలంగా మారింది. గ్రామాల్లోకి ప్రవేశించిన ఏనుగుల మందను తరిమికొట్టేందుకు గ్రామస్తులు గట్టిగా కేకలు వేయడం, పెద్దగా డోళ్లతో చప్పుళ్లు చేయడంతో అవి మరింతగా బెదిరిపోయి గ్రామస్తులపై ప్రతీకార దాడులకు దిగుతున్నట్టు డివిజనల్ ఫారెస్ట్ అధికారి గోస్వామి పేర్కొన్నారు. గ్రామస్తులపై దాడులకు దిగుతున్న ‘లాడెన్‌’ ఏనుగును వేటగాళ్లు వేటాడి చంపేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా తాము అటవీశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లుడివిజనల్ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు.అంతటి భయంకరమైన ఈ ఏనుగు గ్రామాలు, జనావాసాల్లోకి ప్రవేశించి కనిపించినవారిపై దాడికి తెగబడుతోంది. అందుకే ఈ ఏనుగుకు అక్కడి గ్రామస్తులు ‘లాడెన్‌’ అని పేరు పెట్టారు. తాజాగా జూన్ 1వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత 3.30 గంటల ప్రాంతంలో అసోంలోని పట్‌పారా పహర్టోలీ గ్రామంలోని ఓ గిరిజనుడి ఇంటిపై ‘లాడెన్‌’ దాడికి తెగబడింది. ప్రతిఘటించబోయిన ఆ ఇంటియజమాని హజోంగ్‌ను నిర్దాక్షిణ్యంగా తొక్కి చంపేసింది. చీకటి పడితే చాలు.. అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామాల మీద పడి విచ్చలవిడిగా‘లాడెన్‌’‌ దాడులకు తెగబడుతుందని అక్కడి స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గోల్‌పార ఫారెస్ట్ డివిజన్‌‌లో గారోకొండల ప్రాంతంలో సాధారణంగా ఏనుగులు సంచరిస్తుంటాయి.

Related Posts