YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

బిగ్ మీట్ పై అందరి దృష్టి

 బిగ్ మీట్ పై అందరి దృష్టి

 ట్రంప్, కిమ్ భేటీని ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్నాయి. రెండు అణ్వాయుధ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న ఆందోళన అన్ని దేశాల్లోనూ ఉన్నది. ట్రంప్, కిమ్ ఇవాళ సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్‌లో భేటీ అయ్యారు. అయితే ఆ సమయంలో ప్రపంచ మీడియా ఆ దృశ్యాలను లైవ్ చేసింది. చర్చల పట్ల ఉత్సుకతో ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్ దేశాలు ఆ మీటింగ్‌ను లైవ్‌లో ఫాలో అయ్యాయి. కానీ అసలైన నార్త్ కొరియా మాత్రం ఆ ఈవెంట్‌ను లైవ్‌లో చూడ లేదు. తమ దేశాధ్యక్షుడు కిమ్ .. అగ్రదేశాధినేత ట్రంప్‌తో భేటీ అవుతుంటే.. ఆ దేశ టీవీ మాత్రం ఆ ఫూటేజ్‌ను లైవ్ చేయలేదు. వివిధ దేశాలకు చెందిన టీవీ స్క్రీన్ షాట్లను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. సాధారణంగా ఉత్తర కొరియా అధికారిక టీవీ ఉదయం ఆరు గంటలకే ప్రారంభం అవుతుంది. కానీ ఆ టీవీ తమ నేత గురించి లైవ్ ఇవ్వలేదు. ట్రంప్‌-కిమ్‌ భేటీ సాకారమయ్యే ముందు కథ అనేక మలుపులు తిరిగింది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో సమావేశం కానున్నానని ట్రంప్‌ మే 10న ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరచారు. తరవాత మే 24న కిమ్‌తో భేటీని రద్దు చేసుకుంటున్నానని ప్రకటించి ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతి పరిచారు. వారంరోజుల పాటు ముమ్మరంగా మంతనాలు జరిగాక, ట్రంప్‌-కిమ్‌ సింగపూర్‌ సమావేశం అనుకున్నట్లే జరుగుతుందని ప్రకటన వెలువడింది.కేవలం బులిటెన్‌లో మాత్రమే ఆ దృశ్యాలను లైవ్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక దక్షిణ కొరియాలో కిమ్ జాంగ్ ఇప్పుడు టాప్ సెర్చ్‌గా మారారు. కింగ్ జాంగ్ వయసు ఎంత అన్న కోణంలోనూ దక్షిణ కొరియా ప్రజలు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే కూడా ట్రంప్, కిమ్ చరిత్రాత్మక భేటీని లైవ్‌లో చూశారు. మెరికా అధ్యక్షుడు ట్రంప్, నార్త్ కొరియా నేత కిమ్ ఇవాళ క్యాపెల్లా హోటల్‌లో కలుసుకున్నారు. ఈ భేటీ పట్ల గొప్పగా ఫీలవుతున్నట్లు ట్రంప్ తెలిపారు. తాము నిర్వహించబోయే చర్చల ద్వారా విజయం సాధిస్తామని ఆశిస్తున్నానని, మా మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని భావిస్తున్నానని, అందులో ఎటువంటి అనుమానం లేదని ట్రంప్ అన్నారు. ఈ భేటీని గౌరవంగా భావిస్తానని ట్రంప్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న గత అనుభవాలు తమకు అవరోధాలుగా మారాయని, అయినా వాటిని అధిగమించి సెంటోసా చేరుకున్నామని కిమ్ అన్నారు.సెంటోసా దీవిలో చరిత్రాత్మక భేటీ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ కలుసుకున్నారు. క్యాపెల్లా హోటల్‌లో ఇద్దరూ భేటీ అయ్యారు. హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వన్ టు వన్ మీటింగ్ నిర్వహించారు. రెండు దేశాల జాతీయ పతకాల ముందు ఇద్దరూ హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. అంతర్జాతీయ మీడియా ముందు ఇద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. వన్ టు వన్ మీటింగ్ తర్వాత.. ద్వైపాక్షిక చర్చలు కూడా ఉంటాయి. ఇద్దరూ చర్చలకు కూర్చుంటారని ఎవరూ ఊహించలేదు. అందుకే ప్రపంచమంతా సింగపూర్‌ భేటీవైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ భేటీలో ఇరువురు ఏ అంశాలపై చర్చించుకుంటారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై ప్రపంచదేశాల్లో ఉత్కంఠ నెలకొంది.ఆ తర్వాత వర్కింగ్ లంచ్‌లో పాల్గొంటారు. సింగపూర్‌లోని ఆర్చడ్ ఏరియాలో బస చేసిన ఇద్దరు నేతలు సెంటోసా దీవిలోని క్యాపెల్లా హోటల్‌కు చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి మీటింగ్ జరుగుతున్న హోటల్ వరకు సింగపూర్ ప్రజలు భారీగా బారులు తీరి ఆ నేతలకు వెల్కమ్ చెప్పారు. ట్రంప్ షాంగ్రి లా హోటల్‌లో ఉన్నారు. కిమ్ సెయింట్ రిగీస్ హోటల్‌లో బస చేశారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి, కిమ్ యో జాంగ్, నమ్మకస్తుడు కిమ్ చాంగ్ సన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. చరిత్రాత్మక భేటీకి సంబంధించిన అన్ని అంశాలు చురుగ్గానే సాగుతున్నాయని ట్రంప్ ట్వీట్ చేశారు. 

Related Posts