
విశాఖపట్నం
మంత్రి నారా లోకేష్ విశాఖలో కోర్టుకు వెళ్లారు. ఓ పత్రిక పరువు నష్టం కేసు లో విచారణకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు ఆయన హాజరయ్యారు. కాగా ఆ పత్రిక తరఫున న్యాయవాది కోర్టుకు హాజరుకాక పోవడంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లా డుతూ.. 2019లో బ్లూ మీడియా పత్రిక తనపై ఒక కథనం రాసిందని.. తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు 25 లక్షలు ఖర్చు చేసిందని వార్త రాసిందని.. దీనికి సంబంధించి అప్పుడు తాను ఆధారాలు చూపించాలంటూ పత్రిక పై లీగల్ నోటీసు జారీ చేశానని లోకేష్ తెలిపారు.