YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కి బ్రాండ్ ఇమేజ్ తేవడానికి చంద్రబాబు కృషి

ఏపీ కి బ్రాండ్ ఇమేజ్ తేవడానికి చంద్రబాబు కృషి

విజయవాడ
గత ఐదేళ్ల వైసీపీ పాలన లో ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్ చెడ్డ పేరు తీసుకొచ్చారని కేంద్ర గ్రామీణా భివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. వైసీపీ పాలన లో దావోస్ పర్యటనకు వెళ్లే పరిస్థి తి లేదని, వెళ్లినా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా నాటి ప్రభుత్వ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై జగన్ అభిమా నులు సోషల్ మీడియాలో విమర్శిం చడం మానుకోవాలని హితవు పలికారు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసు కొచ్చేం దుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 7-8 నెలలలోనే రాష్ట్రానికి 49 కంపెనీలు పెట్టుబ డులకు ముందుకు వచ్చా యని, పెట్టుబడుల విలువ రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటాయని అన్నారు. కాగా, గుంటూరు- నల్లపాడును కలిపే పెద్దపలుకలూరు ఆర్వోబీ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందని, రూ.41 కోట్లతో నిర్మించే ఈ ఆర్వోబీ నిర్మాణానికి మరో మూడు వారాల్లో టెండర్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.

Related Posts