
కడప
బద్వేలు మైదుకూరు రోడ్డులోని ఓ వైన్ షాపులో ఘర్షణ చెలరేగింది. మద్యం మత్తులో పరస్పరం మందు బాబులు కొట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల కిందటే అదే వైన్ షాప్ వద్ద కత్తి , రాళ్లతో దాడి జరిగింది. మద్యం షాపులోనే మద్యం సేవించే అవకాశం కల్పిస్తుండడంతో గొడవలు చెలరేగుతున్నాయి. ఈ పరిణామాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.